హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో మీడియా సెంటర్ ప్రారంభమైంది.ఈ క్రమంలో మీడియా సెంటర్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రారంభించారు.
ఎన్నికలకు మరో రెండు, మూడు నెలలు మాత్రమే ఉందన్నారు.
ఈ క్రమంలో మరో వారం రోజుల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ ముగుస్తుందన్న సీఈఓ వికాస్ రాజ్ జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.అదేవిధంగా ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు.
వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో తెలంగాణలో సీఈసీ పర్యటిస్తుందని తెలిపారు.ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నామని వెల్లడించారు.







