అర‌టిపళ్లు అతిగా తింటే ఎన్ని స‌మ‌స్య‌లో తెలుసా?

అర‌టి పండు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు.

అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉండే అర‌టి ప‌ళ్ల‌ను చిన్న పిల్ల‌లు సైతం ఇష్ట‌ప‌డుతుంటారు.రుచిలోనే కాదు.

బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ అర‌టి పండు ముందుంటుంది.అనేక పోష‌కాలు నిండి ఉండే అర‌టి పండు.

ఎన్నో జ‌బ్బుల‌ను నివారించ‌గ‌ల‌దు.అర‌టి పండులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్‌లో ఉంచి.

Advertisement

అధిక ర‌క్త‌పోటు బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.అర‌టి పండు తిన‌డం వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది.

అందులో ఉండే.విటమిన్స్, మినరల్స్ అందుకు కార‌ణం.

అలాగే అర‌టి పండులో ఫైబ‌ర్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటుంది .కాబ‌ట్టి క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తాయి.ఐర‌న్ కూడా అర‌టి పండులో స‌మృద్ధిగా ఉంటుంది.

కాబ‌ట్టి, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న వారు డైట్‌లో అర‌టి పండు చేర్చుకుంటే ర‌క్త వృద్ధి జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని.అతిగా మాత్రం అర‌టి పళ్ల‌ను తీసుకోరాదు.ఎందుకంటే, అలా చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

వాస్త‌వానికి అరటి పండులో పిండి పదార్థాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.అందువ‌ల్ల అర‌టి ప‌ళ్లు ఎక్కువ‌గా తీసుకుంటే.

Advertisement

పిండి పదార్థాలు జీర్ణం కావ‌డానికి అధిక స‌మ‌యం ప‌డుతుంది.దాంతో ఆ ప్రభావం జీర్ణాశయం మీద ప‌డి జీర్ణ శ‌క్తి లోపించ‌డంతో పాటు బ‌రువు పెరిగేలా చేస్తాయి.

అలాగే అర‌టి పళ్లు అతిగా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం ఇత‌ర ఆహారాల నుంచి పోష‌కాల‌ను గ్ర‌హించే శ‌క్తి కోల్పోతుంది.దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

ఎక్క‌వుగా అర‌టి ప‌ళ్లు తిన‌డం వ‌ల్ల దంతాలు కూడా పాడైపోతాయి.ఇక అర‌టి ప‌ళ్లు అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం కాకుండా.క‌డుపు నొప్పి, గ్యాస్ స‌మ‌స్య ఏర్ప‌డేలా చేస్తుంది.

అందువ‌ల్ల రోజుకు రెండు అర‌టి ప‌ళ్ల‌కు మించి తీసుకోరాద‌ని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు