నెల‌కు 2 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే వైట్ హెయిర్‌కు దూరంగా ఉండొచ్చు!

ఒక వ‌య‌సొచ్చాక తెల్ల జుట్టు వ‌చ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ, యంగ్ ఏజ్‌లోనే జుట్టు తెల్ల‌బ‌డితే వ‌య‌సు పైబ‌డిన వారిలా క‌నిపిస్తారు.

ఈ నేప‌థ్యంలోనే ఇరుగు పొరుగు వారు ఎగ‌తాళి చేస్తార‌న్న భ‌యంతో.వైట్ హెయిర్‌ను క‌వ‌ర్ చేసుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.

అయితే తెల్ల జుట్టు వ‌చ్చాక ముప్ప తిప్ప‌లు ప‌డ‌టం కంటే.రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో ఉత్త‌మం.

అయితే అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ ప్యాక్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఆ హెయిర్ ప్యాక్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.ఇలా మ‌రిగిన వాట‌ర్‌ను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, కాచి చ‌ల్లార్చిన మెంతి నీరు వేసుకుని బాగా క‌లిపి మూత పెట్టి రెండు గంటల పాటు వ‌దిలేయాలి.

ఆపై అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అర‌టి పండు పేస్ట్‌, ఒక ఎగ్ వైట్‌, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్‌ కోక‌న‌ట్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకుంటే ప్యాక్ సిద్ధ‌మైన‌ట్లే.దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.గంట‌న్న‌ర ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.

అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.నెల‌కు రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే వైట్ హెయిర్‌కు దూరంగా ఉండొచ్చు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఒక‌వేళ వైట్ హెయిర్ ఉన్నా.క్ర‌మంగా న‌ల్ల‌గా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు