చిన్న వ‌య‌సులోనే ముడ‌త‌లా? డోంట్ వ‌ర్రీ.. ఇలా చేయండి!

ఇటీవల రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే ముడతలను ఫేస్ చేస్తున్నారు.

ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే ముడతలు తలుపు తడుతుంటాయి.

ఈ ముడతలు వల్ల అందం తగ్గడమే కాదు వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.ఈ క్రమంలోనే ముడత‌ల‌ను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను మీరు కనుక వాడితే ముడతలు తగ్గడమే కాదు మళ్ళీ మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక చిన్న సైజు కీర, క్యారెట్ ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement

అలాగే అరటి పండును తొక్క తల‌గించి సన్నగా స్లైసెస్ గా కట్ చేయాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కీరా ముక్కలు, అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.

అలాగే రెండు బ్లూ బెర్రీలు, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, మూడు నుంచి నాలుగు పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను వేసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేయాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, ఆఫ్ టేబుల్ స్పూన్ అల్లం పౌడర్ ను వేసి పదిహేను నిమిషాల‌ పాటు ఉడికించాలి.అనంతరం స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ప్రతిరోజూ స్నానం చేయడానికి గంట లేదా గంటన్నర ముందు ఈ ఆయిల్ ను ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే ముడతలు క్రమంగా మాయమవుతాయి.

Advertisement

అదే సమయంలో చర్మం యవ్వనంగా మరియు గ్లోయింగ్ గా మెరుస్తుంది.

తాజా వార్తలు