వైసీపీ మంత్రి జోగి రమేష్ కి ఈసీ నోటీసులు..!!

వాలంటీర్ల విషయంలో చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్( Minister Joogi Ramesh ) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu )పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఈసీకి అందజేయడం జరిగింది.

దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్( Election Commission ) మంత్రి జోగి రమేష్ కు నోటీసులు జారీ చేసింది.రెండు రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.ఇంక 40 రోజులు మాత్రమే సమయం ఉంది.

Ec Notices To Ycp Minister Jogi Ramesh, Ap Elections, Ec, Jogi Ramesh,chandrabab

దీంతో ఎన్నికలలో పోటీ చేసే నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఏపీలో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన పూర్తయింది.కొన్ని స్థానాలు మినహా మెజార్టీ స్థానాలలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పూర్తయింది.

Advertisement
EC Notices To YCP Minister Jogi Ramesh, AP Elections, EC, Jogi Ramesh,Chandrabab

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమలులోకి వచ్చింది.దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు బ్యానర్లు ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది.

అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.ఈ క్రమంలో ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

అయినా సరే నాయకులు ఎన్నికల ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉండటంతో ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది.

తాజా వార్తలు