ఏ వ్యాధి అయినా, వచ్చిన కొత్తల్లోనే గుర్తుపట్టి, త్వరగా చికిత్స మొదలుపెట్టాలి.లేదంటే వ్యాధి ముదిరిపోతుంది.
మొక్కగా ఉన్నప్పుడు వంచలేదు, అది వృక్షమై కీడు చేస్తుంది.ప్రమాదకర వ్యాధులలో మధుమేహం ఒకటి.
ఇది చాలా సామాన్యమైన వ్యాధి.దీన్ని మొదట్లోనే కనిపెట్టాలి.
ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.* నోటి దుర్వాసన, చిగుళ్ళ వ్యాధి: మధుమేహం మోసుకొచ్చే ఇన్ఫెక్షన్స్ వలన, నాలుక, పళ్ళు, నోరంతా దెబ్బతింటుంది.రుచి సరిగా అనుభవించలేకపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ళు దెబ్బతినటం జరుగుతుంది.
* మూత్రం తరుచుగా రావడం : ఇది అందరికి బాగా తెలిసిన లక్షణం.ఒంట్లో పెరిగిన షుగర్ లెవెల్స్ తట్టుకోలేకే, శరీరం అధికంగా మూత్ర విసర్జన చేస్తుంది.
* ఇన్ఫెక్షన్స్ : మధుమేహం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ దాకా, అన్ని శరీరం మీద దాడిచేస్తాయి.తరచుగా జ్వరం రావడం, స్కిన్ మీద రాశేష్ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.* నీరసం : ఎలాంటి శ్రమ లేకపోయినా, నీరసం వచ్చేస్తుంటుంది.మధుమేహం యొక్క ముఖ్య లక్షణాల్లో ఇదొకటి.
ఇవి మాత్రమే కాకుండా, చూపు మందగించడం, అరికాళ్ళలో మంట, చర్మం నల్లబడటం , దురద అతిగా వేయడం కూడా మధుమేహ వ్యాధి లక్షణాలే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy