24 గంటల్లో 103 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకెళ్తోన్న ‘డంకీ డ్రాప్ 4’...

హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఫీలింగ్‌తో ఈ ఏడాదికి వీడ్కోలు పలకాలనుకుంటున్న అభిమానులు, సినీ లవర్స్ఈ ఏడాది షారూక్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి ‘డంకీ’తో మ్యాజిక్‌ను క్రియేట్ చేయబోతున్నారు. ‘డంకీ డ్రాప్ 4’గా రిలీజైన డంకీ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.

 'dunky Drop 4' Is Soaring With 103 Million Views In 24 Hours , Dunky Drop 4, 103-TeluguStop.com

మనసులను హత్తుకునే భావోద్వేగాలతో రాజ్‌‌కుమార్ హిరాని సినిమాను చక్కగా రూపొందించారని ట్రైలర్‌లో తెలుస్తుంది.షారూక్ ఖాన్ సహా తాప్సీ, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, బోమన్ ఇరాని వంటి అద్భుతమైన నటీనటులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయిన తీరు ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్ రైడ్‌లా డంకీ సినిమా ఉంటుందనే భావనను కలిగించింది.

షారూక్ ఖాన్ తిరుగులేని చార్మింగ్ లుక్స్‌కి రాజ్‌కుమార్ హిరాని భావోద్వేగాలు సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్ని క్రియేట్ చేయనున్నాయి.అందుకు రీసెంట్‌గా రిలీజైన ట్రైలరే తార్కాణంగా నిలుస్తోంది.

డంకీ డ్రాప్ 4 అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌కు అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో కలిపి 24 గంటల్లో 103 మిలియన్స్ వ్యూస్ రావటమే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ తెలియజేస్తుంది.పఠాన్, జవాన్ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్న కింగ్ ఖాన్ షారూక్ ఈసారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

డంకీ డ్రాప్ 4 (ట్రైలర్) రిలీజైనప్పటి నుంచి హాట్ టాపిక్‌గా మారింది.

డంకీ డ్రాప్ 4ను గమనిస్తే ఆయన సినిమా కోసం ఆయన తన ప్రపంచాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారనే విషయం తెలుస్తోంది.

కొన్విని నిజ ఘటనలను ఆదారంగా చేసుకుని దేశాలకు వెళ్లాలనుకునే స్నేహితుల కథతో రూపొందిన సినిమా ఇది.ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాల కలయికగా ఓ వైపు నవ్విస్తూనే హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది.డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు.బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు.

ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు.

ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube