భర్త చనిపోయిన ఐదో రోజే షూట్ కు వెళ్లా.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన డబ్బింగ్ జానకి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఆఫర్లను నేను వదులుకోలేదని వాళ్లే నన్ను వదిలేశారని ఆమె తెలిపారు.

ఇప్పటికీ ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఫోటోలు పంపిస్తారా అని అడుగుతారని డబ్బింగ్ జానకి పేర్కొన్నారు.

ఎవరైనా అలా అడిగితే సారీ అండి నేను రాను అని చెబుతానని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.బాలచందర్ గారి డైరెక్షన్ లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి ఉంటే బాగుండేదని అనిపించిందని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాకోసం అనుకున్న ఒక పాత్ర డేట్లు ఇచ్చిన తర్వాత బాలచందర్ డైరెక్షన్ లో పోయిందని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.సప్తపది సినిమాలోని పాత్ర అంటే నాకు చాలా ఇష్టమని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం మదర్ రోల్స్ కు ఇతర భాషల ఆర్టిస్టులను తీసుకుంటున్నారని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.

నిర్మాతలకు బిజినెస్ లెక్కలు ఉంటాయని డబ్బింగ్ జానకి వెల్లడించారు.ప్రొడ్యూసర్ బాగుంటే అందరికీ వేషాలు దొరుకుతాయని నేను భావిస్తానని ఆమె తెలిపారు.

Advertisement

మాకు నటన తప్ప వేరే పని తెలియదని ఆమె కామెంట్లు చేశారు.టీవీ రంగం వల్లే అందరూ బ్రతుకుతున్నారని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమాల కంటే సీరియళ్లతోనే ఎక్కువగా గుర్తింపు దక్కిందని ఆమె కామెంట్లు చేశారు.భర్త చనిపోయిన తర్వాత చాలా బాధ పడ్డానని ఆమె తెలిపారు.

భర్త చనిపోయిన ఐదో రోజునో ఆరో రోజునో చెన్నై నుంచి నేను షూటింగ్ కు వెళ్లిపోయానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.భర్త చనిపోయాడని చెప్పి ఇంకొకరిని బాధ పెట్టలేదని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.డబ్బింగ్ జానకి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement