మిర్చీ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ విషయాన్ని తెలుసుకోండి!

ఘాటు ఘాటుగా ఏదైన వంటకం తింటే అబ్బా ఆ రుచే వేరు.చాలా మంది స్పైసీగా తినడానికి ఇష్టపడుతుంటారు.

కాని కొందరు మాత్రం అస్సలు కారం వైపే మొగ్గుచూపరు.అధికమైన కారం తింటే బీపీ పెరుగుతుందని, ఎసిడిటీ, అల్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని సప్పటి తిండికి అలవాటుపడేవారు చాలా మందే ఉన్నారు.

కాగా కొంత మంది మాత్రం ఎవ్వరు ఏమన్నా చెప్పని నేను మాత్రం హాట్ గా ఉంటే గాటునే తింటామని లాంగించేస్తుంటారు.మరి దానిమూలంగా చాలా మంది ఏమవుతుందేమోనని ఓ తెగ బయపడిపోతుంటారు.కాగా కారంతో ప్రమాధముందని బయపడేవారికి ఓ పరిశోధన ఊరటనిచ్చింది.

అమెరికన్ మార్ట్ అసోసియేషన్(ఏహెచ్ఏ) అధ్యయనం స్పైసీ గురించి మంచి శుభవార్త ను చెప్పిందండోచ్.అదేంటంటే ఎండు మిరప కారంతో వండిన ఆహార పదార్థాలను రోజూ తినడం మూలంగా ఆయుర్దారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Advertisement

అలాగే కారమున్న పదార్థాలను తీసుకోవడం వల్ల వాపు, నొప్పిని నివారించే యాంటి ఇన్ ఫ్లమేటరీ, బ్లడ్ సెల్స్ కూడా సక్రమంగా పనిచేస్తాయి.

దీనితో పాటుగా బ్లడ్ గ్లూకోజ్ అదుపులో ఉండటంతో క్యాన్సర్ నిరోధకాలు పెరుగుతాయని అధ్యయనంలో తేలింది.అలాగే మరీ ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరను సక్రమంగా జరిగేందుకు కారంప్పొడి చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అలాగే మరణం తొందరగా దరి చేరకుండా ఉండేందుకు కూడా గాటు పదార్థాలు మేలు చేస్తాయని తన పరిశోధనలో ఏహెచ్ ఏ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.కాగా అమెరికా, ఇటీ, చైనాకు చెందిన 5.7 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఈ అంచనాకు వచ్చారు.కాగా స్పైసీ వుడ్ నీ తీసుకోవడం మూలంగా గుండెకు, శరీరంలో రక్త ప్రసరణ నాళాల సమస్యలతో 26 శాతం మరణాన్ని తగ్గించేందుకు అవకాశం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు.

దీనితో పాటుగా క్యాన్సర్ 23, అలాగే అన్ని రకాల మరణాల నుంచి 25 శాతం మరణం తగ్గుతుందని పరిశోధనలో వెళ్లడైంది.మరి సప్పటి ఆహారం తీసుకునే వారెవరైనా ఉంటే మరి స్పైసీకి అలవాటుపడిపోడింది.

మీ జీవిన గడియలను మరిన్ని రోజులు పెంచుకోండి.

ఎర్ర జామ పండు తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
Advertisement

తాజా వార్తలు