హైదరాబాద్ ఎల్బీనగర్ లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ ఎల్బీనగర్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి.అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ పేపర్ స్టిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.కాగా గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు కిరణ్ కుమార్, సతీశ్, హరికృష్ణలను అరెస్ట్ చేశారు.న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు