Reckless Driving Gurugram: కారు స్టంట్ చేస్తూ ఒకరిని చంపేసిన యువకులు.. షాకింగ్ వీడియో వైరల్!

ఆకతాయిలు పబ్లిక్ రోడ్లపై స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.

కాగా తాజాగా గురుగ్రామ్‌లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఓ పిచ్చి స్టంట్ చేశారు.

ఈ స్టంట్ మిస్ కావడంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఆదివారం తెల్లవారుజామున ఉద్యోగ్ విహార్ ఫేజ్-4లో 2 గంటలకు జరిగింది.

సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజనులు షాక్ అవుతున్నారు.

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో మద్యం మత్తులో ఉన్న పురుషులు మారుతీ ఎర్టిగా, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ క్రెటాను ఉపయోగించి మద్యం షాపు వెలుపల స్టంట్స్ చేయడాన్ని చూడవచ్చు.

Advertisement

ఈ క్రమంలోనే ఎస్‌యూవీలలో ఒకటి అదుపు తప్పి పక్కనే ఉన్నవారిని ఢీకొట్టింది.దాంతో ఒక చెత్త వేరుకునే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేసి రెండు కార్లను సీజ్ చేశారు.ఈ నిందితులలో ఒకరు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ అని, ముగ్గురు వ్యక్తులు ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.మరోవైపు ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.

మొదట నిందితులు కారు స్టంట్ చేశారని, రెండవ స్టంట్‌లో మద్యం షాపు వెలుపల నిలబడి ఉన్న వారిని ఢీ కొట్టారని, అందులో ఒక 50 ఏళ్ల వయస్కుడు మరణించాడని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు.

ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు