ఎన్నారై భర్తలు( NRI Husband ) భార్యలను వేధిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.తాజాగా మరొక మహిళ ఎన్నారై ను పెళ్లి చేసుకొని దారుణంగా మోసపోయింది.
వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ నగరంలోని( Ahmedabad ) ఆనంద్‌నగర్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మహిళ అమెరికాలో( America ) ఉంటున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే తన భర్త పెళ్లి అయిన ఏడాదిన్నర తర్వాత తనను విడిచిపెట్టాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాను న్యూజెర్సీకి( New Jersey ) చెందిన వ్యక్తిని 2020, డిసెంబర్ 28న మ్యారేజ్ చేసుకున్నానని, 2021, ఏప్రిల్ 29న యూఎస్‌లోని అతని వద్దకు వెళ్లానని, కొన్ని నెలలకు అత్తమామలు కూడా యూఎస్ వచ్చారని ఆ మహిళ తెలిపింది.
తరువాత తక్కువ కట్నం( Dowry ) తెచ్చానని భర్త, అత్తమామలు కలిసి తనను బాగా కొట్టారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
వారు ఆమెను ఇంటి పనులన్నీ చేయమని బలవంతం చేశారట.బయటకు వెళ్లడానికి లేదా స్నేహితులను కలవడానికి కూడా అనుమతించలేదట.తన భర్త, అత్తమామలు తనను 2022, సెప్టెంబర్ 17న భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని బలవంతం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో ఆనంద్‌నగర్‌లో( Anandnagar ) తలదాచుకుంటున్నట్లు వెల్లడించింది.అప్పటి నుంచి తన భర్త తన కాల్స్‌ను లిఫ్ట్ చేయడం లేదని, తన మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.అత్తమామలు ఫోన్ ఎత్తినా కారు తమ కొడుక్కి గ్రీన్ కార్డ్ ఉన్న మహిళ దొరుకుతుందని, విడాకులు( Divorce ) ఇచ్చేస్తే వేరే పెళ్లి చేసుకుంటాడని చెబుతూ తిడుతున్నట్లు వెల్లడించింది.
చివరికి తన భర్త తనను పూర్తిగా వదిలేశాడని తెలుసుకొని చాలా బాధపడ్డానని తెలిపింది.

ఆ మహిళ తన భర్త, అత్తమామలపై గృహహింస ఆరోపణలపై ఆనంద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.ఈ విషయమై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.భర్తలు, అత్తమామల వల్ల గృహహింసకు గురవుతున్న ఎందరో మహిళల దుస్థితిని గుర్తుచేస్తోంది ఈ మహిళ ఉదంతం.
గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలు మాట్లాడటం, అధికారుల సహాయం తీసుకోవడం ముఖ్యం.గృహ హింసకు గురవుతున్న మహిళలకు అనేక సంస్థలు మద్దతునిస్తున్నాయి.







