పెరుగును అలా తింటే తిప్ప‌లు త‌ప్ప‌వు.. జాగ్ర‌త్త‌!

పెరుగు.నిత్యం మ‌నం తినే ఆహారాల్లో ఇది ముందుంటుంది.

ఎంతో రుచిగా ఉండే ఈ పెరుగును పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఇష్టంగా తింటుంటారు.

ఇక రుచిలోనే కాదు.

పెరుగుతో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.శ‌రీరానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు పెరుగు ద్వారా ల‌భిస్తాయి.

అలాగే ఎన్నో జ‌బ్బుల‌ను కూడా పెరుగుతో దూరం చేసుకోవ‌చ్చు.ప్ర‌తి రోజు పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.

Advertisement
Dont Eat Curd Like This! Dont Eat Curd, Curd, Latest News, Health Tips, Health,

ర‌క్త పోటు ఎప్పుడు అదుపులో ఉంటుంది.జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.సూర్యర‌శ్మి నుంచి ల‌భించే విట‌మిన్-డి సైతం పెరుగులో ల‌భిస్తుంది.

ఇక క్యాన్స‌ర్ వంటి భ‌యంక‌ర వ్యాధిని అడ్డుకునే శ‌క్తి కూడా పెరుగుకి ఉంది.అందుకే వైద్యులు సైతం పెరుగును రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబుంటారు.

పెరుగు ఆరోగ్యానికి మంచిదే.అయిన‌ప్ప‌టికీ.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కొన్ని కొన్ని విధాలుగా దానిని తీసుకుంటే మాత్రం అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Dont Eat Curd Like This Dont Eat Curd, Curd, Latest News, Health Tips, Health,
Advertisement

సాధార‌ణంగా పెరుగును అతిగా తినేస్తుంటారు.అంటే ఎలాంటి లిమిట్ లేకుండా పెరుగును తింటుంటారు.కానీ, అలా తిన‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

కేవ‌లం రోజుకు ఒక క‌ప్పు లోపు మాత్ర‌మే పెరుగును తీసుకోవాలి.అలాగే చాలా మంది మ‌ట‌న్‌, చికెన్‌, ఫిష్ వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ వండేట‌ప్పుడు పెరుగు వేసి వండుతుంటారు.

అలాగే నాన్ వెజ్ ఐటెమ్స్ తిన్నాక చివ‌ర్లో పెరుగు తింటుంటారు.కానీ, అలా చేయ‌డం ఏ మాత్రం మంచిది కాదు.

ఈ రెండు క‌లిపి లేదా ఒకేసారి తీసుకోవ‌డం వ‌ల్ల‌.ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌కాక‌.

గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ఇక చాలా మంది పెరుగులో పండ్లు ముక్క‌లు క‌లుపుకుని ఇష్టంగా తింటుంటారు.

కానీ, ఇలా తిన‌డం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇలా పెరుగు మ‌రియు పండ్లు క‌లిపి తీసుకుంటే మెటబాలిజం సమస్యలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

కాబ‌ట్టి, పెరుగుతో బీ కేర్‌ఫుల్!.

తాజా వార్తలు