పుల్ల‌టి మ‌జ్జిగ‌తో ఇలా చేస్తే జుట్టు అస్స‌లు రాల‌ద‌ట‌.. తెలుసా?

ప్ర‌స్తుత వేస‌వి కాలంలో అధిక వేడి కార‌ణంగా మ‌జ్జిగ ఇట్టే పుల్ల‌గా మారిపోతుంటాయి.దాంతో ఆ మ‌జ్జిగ‌ను తాగ‌లేక బ‌య‌ట పార‌బోసేస్తుంటారు.

కానీ, ఇక‌పై అలా చేయ‌కండి.ఎందుకంటే, పుల్ల‌టి మ‌జ్జిగ జుట్టుకు మ‌రియు చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ముఖ్యంగా హెయిర్ ఫాల్‌తో బాధ ప‌డే వారికి పుల్ల‌టి మ‌జ్జిగ చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంత‌కీ కేశాల‌కు పుల్ల‌టి మ‌జ్జిగ‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాగా పండిన ఒక అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి స్పూన్ సాయంతో మెత్త‌గా స్మాష్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో స్మాష్ చేసుకున్న అర‌టి పండు, ఒక ఎగ్ వైట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మ‌రియు అర క‌ప్పు పుల్ల‌టి మ‌జ్జిగ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు క‌దుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారంలో ఒక‌సారి చేశారంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య క్ర‌మంగా కంట్రోల్ అయిపోతుంది.

అలాగే చ‌ర్మానికి కూడా పుల్ల‌టి మ‌జ్జిగ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, ఐదు టేబుల్ స్పూన్ల పుల్ల‌టి మ‌జ్జిగ‌, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.త‌ర‌చూ ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకుని చ‌ర్మంపై మచ్చ‌లు, ముడ‌త‌లు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు