గ్రీన్ టీ తో ఈ విధంగా చేశారంటే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!

ముఖ చర్మంపై ఎటువంటి మచ్చలు లేకుండా అందంగా కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

స్పాట్ లెస్ స్కిన్( Spotless skin ) ను పొందడానికి రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే మచ్చలేని చర్మాన్ని మీ సొంతం చేయడానికి గ్రీన్ టీ కూడా చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.ఆరోగ్యపరంగా గ్రీన్ టీ( Green tea ) అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచే సత్తా కూడా గ్రీన్ టీ కి ఉంది.ముఖ్యంగా ముఖంపై ఎలాంటి మచ్చలనైనా గ్రీన్ టీ తొలగించగలదు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ గ్రీన్ టీ బ్యాగ్ వేసి పది నిమిషాల పాటు వదిలేయాలి.దాంతో గ్రీన్ టీ సారం రోజ్ వాటర్( Rose water ) లోకి దిగుతుంది.

అప్పుడు గ్రీన్ టీ బ్యాగ్ ను తొలగించి రోజ్ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఏ విధంగా చేస్తే ముఖం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే త‌గ్గుముఖం పడతాయి.

కొద్దిరోజుల్లోనే స్పాట్ లేస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ స్మూత్ గా మారుతుంది.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

మొటిమలు( Acne ) ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

Advertisement

చర్మం అందంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు