నైట్ నిద్రించే ముందు ఇలా చేస్తే మొండి మొటిమ‌లైనా మాయమవుతాయి!

యుక్త వ‌య‌సు వ‌చ్చిందంటే చాలు మొట్ట మొద‌ట ఇబ్బంది పెట్టే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లే ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

అధిక కొవ్వు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం, అదనపు నూనె ఉత్పత్తి, బాక్టీరియా వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే కొంద‌రికి మొటిమ‌లు వ‌చ్చాయంటే అంత త్వ‌ర‌గా పోవు.వీటినే మొండి మొటిమ‌లు అని అంటారు.

ఇవి తీవ్ర‌మైన నొప్పి మ‌రియు అసౌక‌ర్యానికి గురి చేస్తాయి.మిమ్మ‌ల్నీ మొండి మొటిమ‌లు వేధిస్తున్నాయా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ చిట్కాను ప్ర‌య‌త్నిస్తే చాలా వేగంగా మొండి మొటిమ‌ల‌ను మాయం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు ప‌చ్చి పాలు, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసి ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.

Advertisement

త‌ద్వారా పాలు కాస్త విరిగిన‌ట్టు అవుతాయి.అప్పుడు అందులో చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి హ్యాండ్ బ్లెండర్ సాయంతో ఒక‌టి లేదా రెండు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో మొటిమ‌లు ఉన్న చోట మాత్ర‌మే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేయాలి.

రోజూ నైట్ నిద్రించే ముందు ఇలా చేసి.ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే ఎంత‌టి మొండి మొటిమ‌లైనా మాయం అవ్వ‌డం ఖాయం.

మొటిమ‌లు తాలూకు మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గిపోతాయి.అంతేకాదు, ఈ సింపుల్ చిట్కాను ప్ర‌య‌త్నిస్తే.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

ముఖం మృదువుగా, కాంతి వంతంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు