బొమ్మతో ఫుడ్ తినిపించాలని అనుకున్న కుక్క.. క్యూట్ వీడియో వైరల్..

సాధారణంగా కుక్కలు తమ బెడ్‌తో పాటు ఆట బొమ్మలతో బాగా అటాచ్ అవుతుంటాయి.

కొన్ని కుక్కలు తమ బొమ్మలతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి అవే తమకు ప్రపంచంలా భావిస్తాయి.

ఇవి వాటిని కాసేపు కూడా వదిలి ఉండలేవు.యజమానులు వాటిని వాష్ చేద్దామని ప్రయత్నించినా ఇవి ఒప్పుకోవు.

ఎందుకంటే ఆ బొమ్మలలో నిజంగా ప్రాణం ఉందని ఇవి భావిస్తున్నాయి.వాటికి ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందోనని భయపడిపోతుంటాయి.

అయితే తాజాగా ఒక కుక్క తన బొమ్మకి తన ఫుడ్ అందించి, తినమని బలవంతం చేసింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు దాదాపు 40 లక్షల వ్యూస్‌తో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.@Thund3rb0lt షేర్ చేసిన 26 సెకన్ల నిడివి గల వీడియో ఓపెన్ చేయగానే ఒక డోర్ ముందు మనకు ఒక కుక్క కనిపిస్తుంది ఈ కుక్కకు ఒక గిన్నెలో డాగ్ ఫుడ్ పెట్టారు.అయితే ఆ ఫుడ్ అది తినకుండా తన బొమ్మను తినమని సైగ చేసింది.

Advertisement

బొమ్మలు ప్రాణం లేదు కాబట్టి అది తినలేదు.దాంతో బొమ్మను ఆ గిన్నెలో వేసి తన మూతితో ఆ బొమ్మపై ఒత్తుతూ తిను తిను అంటూ బలవంతం చేసింది.

ఆ బొమ్మ మూతి నిలిచింది లో పెట్టిన తర్వాత తింటుందో లేదో అది చూస్తూ ఉండిపోయింది.ఈ క్యూట్ దృశ్యాలను యజమాని తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తమ కుక్కలు కూడా వాటి టాయ్స్‌తో ఇదేవిధంగా అటాచ్ అయ్యాయని పేర్కొంటున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Ashwini Dutt : నా కెరీర్ లో అత్యంత లాభాలు పొందిన సినిమా అదే
Advertisement

తాజా వార్తలు