యజమాని కడుపులోని బిడ్డ కోసం వెయిట్ చేసిన కుక్క.. బ్యూటిఫుల్ వీడియో..

కుక్కలకు మాటలు రావనే కానీ అవి తమ యజమానులు చేసే అన్ని పనులను అర్థం చేసుకోగలవు.యజమానులు బాధపడుతుంటే అవి ఆ విషయాన్ని గ్రహించగలవు.

 Dog Beautiful Reaction Towards Pregnant Owner Video Viral Details, Viral News, L-TeluguStop.com

ఓనర్లకు పిల్లలు ఉంటే వారిని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని కూడా ఇవి అర్థం చేసుకుంటాయి.యజమానులు వేరే పనుల్లో ఉన్నప్పుడు పిల్లలను కంటికి రెప్పలా కాపాడతాయి.

ఇక యజమాని కడుపులో బిడ్డ ఉంటే కూడా ఇవి వారు తల్లి కాబోతున్నారన్న విషయాన్ని తెలుసుకోగలవు.తాజాగా ఒక కుక్క( Dog ) తన ఓనర్ ప్రెగ్నెంట్( Pregnant ) అయిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను త్వరగా చూడాలని ఆరాటపడింది.

అది మొదటినుంచి ఆ బిడ్డ రాక కోసం ఎంత వెయిట్ చేసిందో చూపించేందుకు ఒక వీడియో కూడా తీశారు.చివరికి ఆ కుక్క ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న బిడ్డను చూసి తెగ మురిసిపోయింది.తండ్రి బిడ్డను కొట్టినట్లు యాక్షన్ చేస్తుండగా అది కొట్టొద్దు అన్నట్లు ఆపింది.బిడ్డ( Baby ) పక్కనే పడుకుని తన ప్రేమను కురిపించింది.ఈ కుక్క మనుషుల లాగానే ప్రేమ చూపించిన తీరు చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ కుక్కకి చాలా విషయాలు అర్థమవుతున్నాయని అని కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి కుక్క తమకు కూడా ఉంటే బాగుందని మరికొందరు అన్నారు.ఈ కుక్కకు సంబంధించిన వీడియోను @TheFigen ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.“ఈ కుక్క ఓనర్( Dog Owner ) బిడ్డను తన తోబుట్టు లాగా ఫీల్ అవుతోంది.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వైరల్ వీడియోకి ఇప్పటికే ఒక కోటి 45 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.ఈ హార్ట్ టచింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube