బంగాళదుంప తింటే లావవుతారా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

బంగాళ‌దుంప లేదా ఆలుగ‌డ్డ‌.చాలా ఇష్టంగా తినే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి.

బంగాళ‌దుంప‌తో మ‌న భార‌తీయులు ర‌క‌ర‌కాల వంట‌లు చేస్తుంది.బంగాళ‌దుంప ఏ వంట‌ చేసిన.

రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.అయితే బంగాళాదుంపల్లో కేలరీలు మ‌రియు కార్బోహైడ్రేట్స్ రెండూ ఎక్కువ‌గానే ఉంటాయి.

అందువ‌ల్ల‌ బంగాళ‌దుంప తింటే లావ‌వుతార‌ని చాలా మంది న‌మ్ముతారు.ఈ క్ర‌మంలోనే వాటిని తినేందుకు సంకోచిస్తుంటారు.

Advertisement

నిజానికి బంగాళాదుంపల్లో కేలరీలు మ‌రియు కార్బోహైడ్రేట్స్ తో పాటు మ‌రిన్ని పోష‌కాలు కూడా ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అలాగే బంగాళ‌దుంప తింటే లావ‌వుతారు అన్న‌ది కేవ‌లం అపోహ మాత్ర‌మే.నిజానికి బంగాళ‌దుంప తింటే బ‌రువు త‌గ్గుతార‌ని ఆరోగ్యానికి నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే, అధిక బ‌రువుని నియంత్రించే ఫైబ‌ర్ బంగాళ‌దుంప‌లో ఉంటుంది.అలాగే బంగాళ‌దుంప తిడ‌నం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండి భావ‌న క‌లుగుతుంది.

దాంతో ఇత‌ర ఆహారాలు తిన‌లేరు.ఫ‌లితంగా ఓవ‌ర్ వెయిట్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక బంగాళ‌దుంప తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

Advertisement

అధిక ర‌క్త పోటు కూడా అదుపులో ఉంటుంది.అలాగే బంగాళ‌దుంప‌ల్లో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం కీళ్ళ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

అదేవిధంగా, చాలా మంది నోటి అల్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అలాంటి వారికి బంగాళ‌దుంప గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.బంగాళ‌దుంప ర‌సాన్ని నోటి పూతపై రాస్తే.

క్ర‌మంగా పుండ్లు త‌గ్గిపోతాయి.ఇక బంగాళ‌దుంప‌ల్లో ఉండే పీచు పదార్ధం జీర్ణ శ‌క్తిని పెంచి.

మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని దూరం చేస్తుంది.అయితే ఆరోగ్యానికి మంచిదా కాని.

బంగాళ‌దుంప‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోరాదు.మ‌రియు వేపుళ్లు, చిప్స్‌లా కూడా చేసుకొని తిన‌రాదు.

ఎందుకంటే, ఇలా చేస్తేనే బ‌రువు పెరిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

తాజా వార్తలు