Satyame Shivam Movie: దేశం గుర్తించదగ్గ ఈ సినిమా ఎంతమంది చూశారు?

భారతీయులమైన మనం సహజంగానే సినిమా ప్రేమికులం.అందుకని మనం అప్పుడప్పుడు చరిత్రపుటల్లోకెక్కిన గొప్ప సినిమాల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం.

ఈ సందర్భంగా మనం ఇపుడు మనం 2003 లో వచ్చిన సినిమా సత్యమే శివం సినిమా( Satyame Shivam Movie ) గురించి మాట్లాడుకోవాలి.సుందర్.

సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కమల్ హాసన్( Kamal Haasan ) సమకూర్చి నటించడం విశేషం.సత్యం(మాధవన్),( Madhavan ) శివ(కమల్ హాసన్) అనే ఇద్దరు వ్యక్తుల జర్నీనే ఈ సినిమా అని అందరికీ తెలిసినదే.

నిజానికి ఈ సినిమా వాళ్ళిద్దరి జర్నీ మాత్రమే కాదు.మనతో మనం చేసే ప్రయాణం, మనలో మనం నలిగిపోయే అంతర్మధనం.

Advertisement

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒకే విషయం స్ఫురణకు వస్తుంది.మతమంటే సాటి మనిషికి సాయం చేయడమే అని.అవును, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని బైబిల్ చెబుతుంది, సాటి మనిషికి సాయం చెయ్ అని ఖురాన్ అంటుంది, మానవ సేవే మాధవ సేవ అని పురాణేతిహాసాలు చెబుతాయి.కానీ వీటికి విరుద్ధంగా నేటి మనిషి జీవిస్తున్నాడు.

ఆకోణంలోనుండి తీసిన సినిమానే ఇది.అవును.మనలాంటి ఆటవిక మనుషులకు తీయబడ్డ ఓ అద్భుత కావ్యం సత్యమే శివం సినిమా.

ఇందులో పాత్రధారి శివ( Shiva ) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది.కమ్యునిజం భావాలు కలిగిన శివ సాటి మనిషికి ప్రేమించమంటాడు.సమాజమే దేవాలయం, ప్రతి మనిషిలో దేవుడున్నాడు అన్నది అతని సిధ్ధాంతం.

ఓ రకంగా చెప్పాలంటే, విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల ప్రయాణమే ఈ సినిమా.కమల్ యాక్సిడెంట్ కి కారణం అయిన కుక్కను అందరూ కొట్టి చంపాలనుకుంటే దాని వల్ల జీవితంలో సర్వస్వం కోల్పోయిన కమల్ మాత్రం దాన్ని ప్రేమించే తీరు అద్భుతం.ఆఖరికి క్లైమాక్స్ లో కార్మికుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూస్తే ఏ మనిషికైనా గుండె బరువెక్కుతుంది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

అలాగే శివకు ట్రీట్మెంట్ చేసిన నర్స్ మళ్ళీ శివను కలిసినప్పుడు చాలా భావోద్వేగానికి గురవుతాం.ఇలాంటి గొప్ప సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి.కాబట్టి భారత సినిమా చరిత్రోలోనే సత్యమే శివం ఓ ఆణిముత్యం అని చెప్పుకోకతప్పదు.

Advertisement

తాజా వార్తలు