సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ లుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొన్న వారే.ఎన్నో కష్టాలను ఎదురుకొని వాటిని భరించి నేడు స్టార్ హీరో హీరోయిన్ ల స్థాయికి ఎదిగారు.
అలా టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న ఒక హీరో కెరియర్ మొదట్లో ఫ్లాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.మొదట హీరో నితిన్ నటించిన సంబరం అనే సినిమాలో డ్రైవర్ పాత్రలో నటించిన అతను ఆ తర్వాత ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.
ఇక అందులో ఒక కాలేజీ కుర్రాడి పాతలో కనిపించాడు.
అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నలుగురు హీరోలలో ఒక హీరోగా నటించాడు సదరు హీరో.
ఆ సినిమాకు గాను మొదటి రెమ్యూనరేషన్ గా 25 వేలు అందుకున్నాడు.ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మొదట్లోనే ఫ్లాప్ హీరోగా ముద్ర పడింది.ఫ్లాప్ హీరో అని ముద్ర పడినప్పటికీ అవకాశాలు మాత్రం భారీగా వచ్చి చేరాయి.కానీ దురదృష్టవశాత్తు వరుసగా అన్ని డిజాస్టర్లు గాని నిలిచాయి.
అలా దాదాపుగా ఆరేళ్ల వరుస ఫ్లాప్ లతో సతమతమైన ఈ యంగ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా మారాడు.ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

వరుసగా సినిమాలలో నటించినప్పటికీ అన్ని ఫ్లాప్ గా నిలిచాయి.ఆ తర్వాత 2013లో విడుదలైన స్వామి రారా సినిమాతో మొదటిసారిగా హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం, 18 పేజెస్, కార్తికేయ 2 అలాంటి సినిమాలలో నటించి మెప్పించాడు.
ఈ సినిమాలు అన్నీ కూడా హిట్ సాధించడంతో వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో.ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఈ సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా జెండా పాతేశాడు.

కార్తికేయ 2 సినిమా నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక భారీ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను సృష్టించింది.ఇకపోతే నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో నిఖిల్ సిద్ధార్థ్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో నిఖిల్ తన తల్లి ఒడిలో కూర్చొని చిన్న కోతి బొమ్మను పట్టుకుని నవ్వులు చిందిస్తున్నాడు.







