యమలోక అధిపతి అయిన యముడి గురించి మీకీ విషయాలు తెలుసా?

యమధర్మ రాజు దక్షిణ దిక్కుకు అధిపతి.అయితే ఈయన సూర్య భగవానుడు, సంజ్ఞ దేవిల కుమారుడు.

సూర్యుని తేజస్సును తట్టుకోలేని సంజ్ఞా దేవి తన ఛాయను సూర్యుని వద్ద ఉంచి పుట్టింటికి వెళ్లిపోయింది.ఛాయ తన పుత్రులను ప్రేమగా చూసుకుంటూ సంజ్ఞా సంతానమైన యముడిపై పక్షపాతం చూపించేది.

DO YOU KNOW YAMA DHARMARAJU QUALITIES, Yamadarma Raju, Chaya, Shyamala Devi, Lor

తనను అనాదరణ చేస్తుందనే కోపంతో తన్నడానికి కాలు ఎత్తగా కాలు విరిగి నేలపై పడమని సంజ్ఞా దేవి శపించింది.ఈ విషయాన్ని సూర్యుడికి చెప్పగా క్రింద పడిన పాదము క్రిములచే తినబడినపుడు శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు.

  శాప భయంచే ధర్మాన్ని కాపాడుతుండటంతో ధర్ముడనే పేరు వచ్చింది.ధర్ముని ధర్మ గుణం బట్టి పితృ లోకాధిపత్యం వచ్చింది.

Advertisement

యముని భార్యలు ధమోర్ణ, విజయలు.చిత్ర గుప్తుడు, లేఖరి, చండుడు మహా చండుడు ఆయన పరివారం.

వట వృక్షం ప్రీతికరమైన వృక్షం.కుంతియయందు నాలుగు యమునికి ధర్మరాజు జన్మించాడు.

మూడు నేత్రాలు, కిరీటం, నాలుగు చేతులతో కాల దండం, పాశం అభయ వరద హస్తాలు కల్గిన యమ ధర్మరాజు యమ లోకానికి అధిపతి.అయితే ఈయన ఎక్కువగా భార్యయైన శ్యామలా దేవితో మహిష వాహనం ఎక్కి ఉంటాడు.మానవుల పాపు పుణ్యాలను లెక్కించి శిక్షలను అమలు చేస్తుంటాడు.

అలాగే మనషుల భూమిపై కాలం తీరిపోయిన వెంటనే పాశం విసిరి వారిని పైకి తీసుకెళ్లిపోతాడు.అయితే వారు చేసిన పాప పుణ్యాల ఆధారంగా స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా కూడా నిర్ణయిస్తుంటాడు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు