మ‌న‌దేశంలో తెలుపు రంగు కార్లే ఎందుకు ఎక్కువ‌గా విక్ర‌య‌మ‌వుతున్నాయో తెలుసా?

మ‌న‌దేశంలో 2018 సంవత్సరంలో దాదాపు 43 శాతం మంది ప్రజలు తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేశారు.వేడి ప్రాంతాలలో నివసించే వారు ఎక్కువగా తెలుపు రంగు కార్లను ఎంచుకుంటారని నిపుణులు అంటున్నారు.

ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు కారు త్వరగా వేడెక్కదు.2019 లో కోటింగ్స్ కంపెనీ సేక‌రించిన‌ డేటా ప్రకారం ప్రపంచంలోని 39 శాతం కార్లు తెలుపు రంగులో ఉన్నాయి.39శాతం కార్లు నలుపు, బూడిద మరియు వెండి రంగులలో ఉన్నాయి.దాదాపు 80 శాతం వాహనాలు అక్రోమాటిక్‌ పెయింట్ క‌లిగివున్నాయి.

కలర్ స్కీమ్‌లో బ్లూ అత్యంత ఇష్టమైన రంగు.దాదాపు 9 శాతం కార్లు ఈ రంగులో ఉంటాయి.7 శాతం వాహనాలు మాత్రమే ఎరుపు రంగులో ఉంటాయి.

Do You Know Why White Cars Is Selling So Much In India Colour America Heat, Cars

ఇక చైనా, ఐరోపా దేశాల గురించి చెప్పుకోవాల్సివ‌స్తే. చైనా ప్రజలు ఎరుపు, నీలం, పసుపు, గోధుమ, బంగారు రంగుల వాహనాలను ఇష్టపడతారు.ఐరోపాలో ప్రతి ఐదవ వాహనం బూడిద రంగులో కనిపిస్తుంది.

గ్రే కాకుండా నలుపు రంగు వాహనాలు కూడా ఉంటాయి.భారతదేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు కొనుగోలు చేసే వారిలో 41 శాతం మంది తెలుపు రంగు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

Advertisement
Do You Know Why White Cars Is Selling So Much In India Colour America Heat, Cars
పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?
" autoplay>

తాజా వార్తలు