మన దేశంలో 'గసగసాలు' ఎందుకు పండించరో మీకు తెలుసా?

భారతదేశం ఆయుర్వేదానికి పెట్టింది పేరు.ఇప్పుడు ఆయుర్వేదం గురించి ప్రస్తావన ఎందుకనేగా మీ ఆలోచన! అవును.

భారతదేవంలో ప్రతి వంటింటిలో ఆయుర్వేదానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి.అందులో గసగసాలు ఒకటి.

మసాలాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పంటలను ఆయా దేశాల ప్రభుత్వాలు నిషేధించాయి.

ముఖ్యంగా మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గంజాయి కనపడితే నేరం.అలాగే నల్ల మందు వంటి వాటిని పండించినా కూడా ఇక్కడ నేరమే అవుతుంది.

Advertisement

ఇక డ్రగ్స్ కి సంబంధించిన పంటలు పండిస్తే అది ఇంకా పెద్ద నేరం.అలాంటి వాటిల్లో గస గసాల పంట కూడా ఒకటి.

మన దేశంలో ఆ పంటను ఎందుకు నిషేధించారో ఒకసారి చుస్తే.గసాల నుంచి నల్లమందు అనేది తయారు చేస్తారు.

నల్ల మందు ఒక మాదకద్రవ్యం అన్న సంగతి తెలిసినదే.గసాలను పెద్ద బాణలిలో వేయించి మాడ్చి మరి కొన్ని దినుసులు కలిపి నల్ల మందుని తయారు చేస్తారట.

కానీ దీని రెసిపీ ఏమిటనేది స్పష్టంగా మనకు తెలియదు.ఇకపోతే చైనా ప్రజలను దుర్భర దారిద్ర్యంలోకి నెట్టిన యుద్ధంగా నల్లమందుని పేర్కొంటారు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

గసాలు అత్యంత ఔషధ విలువలు కలిగి ఉన్న ధాన్యమే అయినప్పటికీ దీనిని ఎక్కువగా చెడు కోసమే వాడతారు.చైనా, థాయిలాండ్ అలాగే మయన్మార్ దేశ సరిహద్దులలో ఆఫ్గనిస్తాన్ మరియు ఇరాన్ దేశాలలో విరివిగా గసగసాలను అక్రమంగా పండిస్తారు.

Advertisement

దీని కాయ మీద అతి సున్నితంగా గాటు పడేలా చేసి… దాని మీద పేరుకున్న స్రావాన్ని సేకరిస్తారు.దీనిని హషీష్ అని పిలుస్తారు.

ఇది డ్రగ్స్ లో అత్యంత ప్రధానమైనది.అప్పట్లో చైనాలో దీనిని పండించిన కోట్లాది మంది రైతులను… సైన్యంలోకి పంపించారట.

ఇంకా దీనిపైన అనేకరకాల కధనాలు వినిపిస్తాయి.గసగసాల వెనక అంత కథ వుంది మరి!.

తాజా వార్తలు