భగవంతుని దర్శనం తర్వాత దేవాలయంలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

సాధారణంగా చెప్పాలంటే మన దేశంలో చాలా మంది ప్రజలు ప్రతి రోజు దేవాలయాలకు వెళ్లి భగవంతున్ని దర్శించుకుని పూజలు, అభిషేకాలు( Pujas , Abhishekals ) చేస్తూ ఉంటారు.

అలాగే మరి కొంతమంది భక్తులు మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే కొంత మంది భక్తులు దర్శనం తర్వాత దేవాలయ పరిసర ప్రాంతాల్లో కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు.అలాగే కొంత మంది భక్తులు ప్రసాదాలను కూడా అక్కడే అరగిస్తూ ఉంటారు.

అయితే స్వామి దర్శనము, శఠగోపం అయ్యాక కాసేపు దేవాలయంలో కూర్చోవాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలా ఎందుకు కూర్చోవాలి.

అలా కూర్చుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక మనసు, శరీరం ఉత్తేజితం అవుతుంది.అలాగే దేవాలయంలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన దేవాలయా నిర్మాణశైలి కూడా మనస్సు ప్రశాంతంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయ ప్రదేశాలలో విద్యుత్ అయస్కాంత శక్తి ( Electromagnetic force )క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ఇటువంటి పాజిటివ్ శక్తి ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలలోనే దేవాలయలను నిర్మిస్తారు.

ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్ ను ప్రతిష్ట చేస్తారు.అలాగే ఈ ప్రదేశాన్ని మూల స్థానం అని కూడా అంటారు.ఈ మూల స్థానంలో భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

అందుకే దర్శనం తర్వాత దేవాలయంలో కూర్చుంటే చిరాకులు దూరమైపోయి భక్తులకు మానసిక ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే చెడు ఆలోచనలు తొలగి మంచి మార్గంలో ప్రయాణించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

కలోంజీ గింజల్లో అద్భుత ఔషధ గుణాలు
Advertisement

తాజా వార్తలు