తిరుమల శ్రీవారిని గోవిందా అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

కలియుగ దైవంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీవారిని నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

భక్తులకు కోరిన కోరికలను నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి వారిని శ్రీహరి, ఏడుకొండలవాడు, వడ్డీ కాసుల వాడు, గోవిందుడు అని పిలుస్తారు.అయితే స్వామి వారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా స్వామి వారిని గోవిందా గోవిందా అనే పేరుతో పూజించడం మనం చూస్తున్నాము.

అయితే స్వామి వారిని ఈ విధంగా గోవిందా అనే పేరుతో పూజించడానికి గల కారణం ఏమిటి ఈ పేరు వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.పురాణాల ప్రకారం ఒకరోజు వెంకటేశ్వరస్వామి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు.

మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా నాకు ఒక గోవు కావాలని అడగడంతో అందుకు అగస్త్య మహాముని చాలా సంతోష పడి స్వామి! నేను మీకు గోవులను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం పత్ని లేనిదే గోదానం చేయకూడదు.కనుక మీరు సతీసమేతంగా వస్తే సంతోషంగా మీకు గోదానం చేస్తానని చెప్పడంతో శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Do You Know Why Lord Venkateshwara Called Govinda Tirumala, Venkateswara Swamy,
Advertisement
Do You Know Why Lord Venkateshwara Called Govinda Tirumala, Venkateswara Swamy,

అయితే ఆశ్రమంలో అగస్త్యుడు లేని సమయంలో శ్రీనివాసుడు పద్మావతినీ వెంట తీసుకుని ఆశ్రమానికి వెళ్లి అగస్త్యుడి శిష్యున్ని, నన్ను మీ గురువు గారు రమ్మన్నారు.గోదానం చేయాలంటే సతీసమేతంగా రమ్మని చెప్పారు.మీ గురువుగారి ఆజ్ఞమేరకు సతీసమేతంగా వచ్చాను నాకు గోవు ఇవ్వు అనడంతో అందుకు ఆ శిష్యుడు తన గురువు లేనిదే గోవులను ఇవ్వడానికి నిరాకరించారు.

మీరు గురువు ఉన్నప్పుడు రావాల్సిందని సూచించాడు.ఈ మాట విన్న శ్రీనివాసుడు ఎంతో ఆగ్రహంతో తిరుమల కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళసాగాడు.

Do You Know Why Lord Venkateshwara Called Govinda Tirumala, Venkateswara Swamy,

ఆశ్రమానికి వచ్చిన అగస్త్యుడితో శిష్యులు జరిగినదంతా చెప్పగా దాంతో అగస్త్యుడు తన శిష్యులతో పాటు మరికొంత మందిని, గోవును తీసుకుని శ్రీనివాసుడు దగ్గరికి బయలు దేరుతారు.స్వామిని కొంత దూరం నుంచి చూసిన అగస్త్యుడు స్వామి అని పిలిచినా అప్పటికీ స్వామి వారు ఆగ్రహంతో అతని మాటలను పట్టించుకోలేదు.ఈ క్రమంలోనే మళ్ళీ అగస్త్యుడు గోవా ఇందా అని చెబుతాడు.

గోవా అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం.అలా గోవు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఇందా గోవు ఇందా అని పిలవడంతో ఆ పేరు గోవిందగా మారి స్వామివారిని గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పూజిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు