పెళ్లిలో పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి పసుపు పెట్టడానికి కారణం తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు పసుపుకి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తారు.ఎటువంటి చిన్న శుభకార్యాలకైనా మొదటగా ఉపయోగించేది పసుపు.

ఇక వివాహ కార్యక్రమాలలో అయితే పసుపు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.ఈ వివాహంలో భాగంగానే వధూవరులకు పసుపు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఈ విధంగా వధూవరులకు పెళ్లిలో పసుపు రాయడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా పెళ్ళిళ్ళు పసుపు ఫంక్షన్ కు ప్రత్యేకించి ఒక రోజు ఎంతో ఘనంగా పసుపు వేడుకను నిర్వహించుకుంటారు.

పెళ్లికి ముందు రోజు వధువు, వరుడులకు పసుపును రాసి వారికి మంగళ స్నానాలు చేయించడం పెళ్లిలో ఒక ఆచారంగా ఉంటుంది.పసుపు మంగళకరమైనదిగా భావిస్తారు కనుక వివాహ కార్యక్రమంలో వధూవరులకు పసుపు రాయడం వల్ల వారి ప్రారంభించబోయే కొత్త జీవితం కూడా శుభ ప్రదంగా వుండాలని దీవిస్తారు.

Do You Know Why It Is Apply Turmeric Before Marriage, Pasupu Function, Marriage,
Advertisement
Do You Know Why It Is Apply Turmeric Before Marriage, Pasupu Function, Marriage,

అంతే కాకుండా పసుపు వధూవరులకు రాయటం వల్ల వారికి ఎటువంటి దుష్టశక్తులు ఆవహించకుండా వాటిని తరిమి కొట్టే శక్తి పసుపుకు వుంటుందని భావిస్తుంటారు.వధూవరులకు పసుపును రాయడం వల్ల వారి చర్మంపై ఉండే దుమ్ము, ధూళి కణాలు నశించిపోయే వారి చర్మం మరింత కాంతివంతంగా ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు.ఈ విధంగా పెళ్లికి ముందే పసుపు ఫంక్షన్ చేయడం వల్ల పెళ్లి సమయానికి వారు ఎంతో కాంతివంతంగా కనిపిస్తారనే భావన కూడా ఉంది.

అంతే కాకుండా వధూవరులకు పసుపు వేడుక చేసిన తర్వాత వారిని బయట తిరగకూడదని చెబుతుంటారు.అలా బయటికి వెళ్లడం వల్ల వారి చర్మం కాంతి విహీనంగా మారుతుందని, వారిని బయట తిరగకూడదని చెబుతుంటారు.

ఈ మధ్యకాలంలో పసుపు వేడుకలలో పసుపుతో పాటు వాటిలో కొద్దిగా చందనం, రోజు వాటర్, శనగపిండిని కలిపి పెళ్లి వేడుకల్లో రాయడం మనం చూస్తున్నాము.పెళ్లిలో వధూవరులకు పసుపు రాయడానికి గల కారణం ఇదేనని చెప్పవచ్చు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు