అల్లు అర్జున్ కు బన్నీ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ఒ కరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన పుష్ప( Pushpa )సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే కాకుండా ఏకంగా ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డును కూడా అందుకున్నారు.ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా ఈ అవార్డు సొంతం చేసుకోకపోవడం గమనార్హం.

Reason Behind Allu Arjun Named Bunny Details,allu Arjun,bunny,pushpa,tollywood I

ఇలా నేషనల్ అవార్డు అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్( Hero Allu Arjun ) రికార్డు సృష్టించారు.ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ ని చాలామంది బన్నీ ( Bunny )అని పిలుస్తూ ఉంటారు.

అయితే ఈయన బన్నీ సినిమాలో నటించడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చిందని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ నిజానికి అల్లు అర్జున్ కు ఈ పేరు చిన్నప్పటినుంచి ఉందని తన కుటుంబ సభ్యులందరూ తనని బన్నీ అంటూ పిలిచేవారని తెలుస్తోంది.

Advertisement
Reason Behind Allu Arjun Named Bunny Details,Allu Arjun,Bunny,Pushpa,Tollywood I

అయితే అల్లు అర్జున్ కు ఈ బన్నీ అనే పేరు పెట్టడం వెనుక ఓ పెద్ద కారణం ఉందట.

Reason Behind Allu Arjun Named Bunny Details,allu Arjun,bunny,pushpa,tollywood I

అల్లు అర్జున్ కు బన్నీ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే .బన్నీ అంటే కుందేలు పిల్ల అనే విషయం మనకు తెలిసిందే.ఈయన చిన్నగా ఉన్నప్పుడు తన ముందు రెండు పళ్ళు కూడా కుందేలు మాదిరిగా ఉండేవట.

ఇలా కుందేలు( Rabbit ) మాదిరిగా పళ్ళు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా తనని బన్నీ అంటూ ముద్దుగా పిలుచుకునేవారనీ తెలుస్తోంది.అయితే ఇప్పటికీ చాలామంది తనని బన్నీ అంటూ అలాగే పిలుస్తారని, అయితే ఈయన కూడా బన్నీ సినిమాలో నటించడంతో ఆ పేరు అలాగే కొనసాగుతూ వస్తోందని చెప్పాలి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు