ప్రపంచ కప్( World Cup ) లో పాల్గొనే ప్రతి జట్టు ఫైనల్ చేరి విజేతగా నిలవాలని కలలు కంటుందని అందరికీ తెలిసిందే.ఫైనల్ చేరడం కోసం ప్రతి జట్టు లీగ్ మ్యాచ్లలో అహార్నిశలు కష్టపడుతూ.
ఆడిన ప్రతి మ్యాచ్ లో తప్పక గెలవాలని ప్రయత్నిస్తాయి.మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తూ, తమ జట్టు ప్లేయర్లని మోటివేట్ చేస్తూ అందరితో బాగా ఆడించుకునే శక్తి ఉన్న కెప్టెన్ ఉన్నప్పుడే ఆ జట్టు ప్రపంచకప్ విజేతగా నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో లీగ్ మ్యాచ్ లన్ని పూర్తయ్యాయి.భారత జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో వరుస విజయాలను సాధించింది.
భారత జట్టులో ఉండే ప్రతి ఆటగాడు తన వంతు కృషి చేస్తూ ఉండడం వల్లే భారత్ విజయాలను సాధిస్తుంది.లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచిన భారత జట్టు అన్ని జట్ల కంటే బలమైన జట్టుగా నిలిచింది.
ప్రపంచ కప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో ఫైనల్ కు చేరి టైటిల్ అందుకున్న జట్లు ఏవో చూద్దాం.

1975 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమైంది.ఈ టోర్నీలో శ్రీలంక, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్( Sri Lanka, Pakistan, Australia, New Zealand, West Indies ) జట్లు పాల్గొన్నారు.వెస్టిండీస్ జట్టు ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లలో గెలిచి వరల్డ్ కప్ 1975 టైటిల్ విజేతగా నిలిచింది.1979వ సంవత్సరంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్ లో విజయం సాధించి మళ్లీ టైటిల్ విన్నర్ గా నిలిచింది.కాకపోతే ఈ టోర్నీలో వర్షం కారణంగా శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ ప్రారంభం అవ్వకుండానే రద్దు అవ్వడం జరిగింది.

2003వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ( South Africa )వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా 11 మ్యాచ్లో గెలిచి, ఫైనల్లో భారత్ ను ఓడించి టైటిల్ విన్నర్ గా నిలిచింది.2007వ సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్లలో వరుసగా గెలిచి రెండవసారి వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది.తాజాగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ట్రోఫీ అందుకుంటే.వన్డే వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచిన మూడవ జట్టుగా భారత్ చరిత్రలో నిలుస్తుంది.







