మండు వేసవిలో ఏ 'టీ' తాగితే మంచిదో తెలుసా..

భారతదేశంలో టీని కేవలం ఓ పానీయంగా చూడరు.టీ అంటేనే చాలా మందికి ఒక భావోద్వేగం.

భారతీయులమైన మనం మసాలా చాయ్ లేకుండా జీవించలేము.ఏ టీ అయినా శరీరంలో డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.

టీ తాగగానే మనస్సును తక్షణమే ఉత్తేజితం అవుతుంది.ఇక వెచ్చని టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

భోజనం తిన్న తర్వాత టీ తాగడం మన దేశంలో ఆనవాయితీ.ఇక టీలలో చాలా రకాలు ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా వేసవిలో గ్రీన్ టీ మంచిదా, బ్లాక్ టీ మంచిదా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి.వాటి గురించి తెలుసుకుందాం.

గ్రీన్‌ టీతో లాభాలు: వేసవిలో గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

ఈ రోజుల్లో మనలో చాలామంది బరువు తగ్గాలని ఎదురు చూస్తున్నారు.ఈ గ్రీన్ టీతో బరువు ఆరోగ్యకరంగా తగ్గొచ్చు.

ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది.గ్రీన్ టీలో థైనైన్ ఉంటుంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఇది తాగే వారిలో ఓదార్పు, ప్రశాంతతను కలిగిస్తుంది.ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది.

Advertisement

యూవీ(అల్ట్రా వయొలెట్) కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించుకోవడానికి గ్రీన్ టీ దోహదపడుతుంది.గ్రీన్ టీలో కాటెచిన్‌లు ఉంటాయి.

ఇవి యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.

బ్లాక్ టీతో ప్రయోజనాలు: పాశ్చాత్య దేశాలలో చాలా మంది తరచూ బ్లాక్ టీ తాగుతుంటారు.భోజనం తిన్న తర్వాత, సాయం కాలం వేళ బ్లాక్ తాగడానికి ఇష్టపడుతుంటారు.అందువల్ల, బ్లాక్ టీ అనేది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన పానీయం.

వేసవిలో బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.ఎక్కువగా వ్యాయామం చేసే వారు డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడుతుంది.

మీ జీవక్రియను కూడా పెంచుతుంది.బ్లాక్ టీలో ఉండే టానిన్లు,ఇతర ప్రయోజనకరమైన రసాయనాలు జీర్ణవ్యవస్థను సాఫీగా చేస్తాయి.

బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఇందులో బీ2, సీ, ఈ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.

బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది మీ జుట్టుకు కూడా మేలు చేస్తుంది.