వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

మాన‌సికంగా, శారీర‌కంగా ఆరోగ్యంగా మ‌ర‌యు ఫిట్‌గా ఉండాలంటే ఖ‌చ్చితంగా వ్యాయామం అవ‌స‌రం.వ్యాయామం ద్వారా ఎన్నో స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.

అందుకే నేటి కాలంలో చాలా మంది వ్యాయామంపై దృష్టి పెడుతున్నాడు.స‌మ‌యం ఉన్న వారు గంట‌.

స‌మ‌యం లేని వారు క‌నీసం ప‌దిహేను నిమిషాలు అయినా వ్యాయామం చేస్తున్నారు.అయితే ఎంత సేపు చేసినా.

వ్యాయామాలు చేసేవారు ఖ‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.అయితే సాధార‌ణంగా చాలా మందికి వ్యాయామం చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న అవ‌గాహ‌న ఉండ‌దు.

Advertisement
Do You Know What Kind Of Food To Take Before Exercise? Exercise, Latest News, G

అలాంటి వారికి ఈ వ్యాసం ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇంత‌కీ వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో లేట్ చేయ‌కుండా చూసేయండి.

వ్యాయామం చేసే అర‌గంట ముందు యాపిల్ లేదా అర‌టి పండు.రెండిట్ల‌లో ఏదో ఒక‌టి త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

ఎందుకంటే, వీటిల్లో ఉండే ప‌లు పోష‌కాలు వ్యాయామం చేసేందుకు తగినంత శక్తిని అందించ‌డంతో పాటు కండ‌రాలు చురుగ్గా ప‌ని చేసేలా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే ఓట్స్‌ను కూడా వ్యాయామానికి ముందు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Do You Know What Kind Of Food To Take Before Exercise Exercise, Latest News, G

బ‌రువు త‌గ్గించ‌డంలో.శారీర‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ ఓట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల‌, వ్యాయామం చేసే రెండు గంటల ముందు ఓట్స్ తీసుకుంటే మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

డార్క్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే వ్యాయామం చేసే ముందు డార్క్ చాక్లెట్ తింటే.

Advertisement

ఎన‌ర్జీ లెవ‌ల్స్ రెట్టింపు అవుతాయి.వ‌ర్క‌వ‌ట్స్‌ను చురుగ్గా చేయ‌గ‌లుగుతారు.

ఇక కొంద‌రికి వ్యాయామం చేసే స‌మ‌యంలో బ్రీతింగ్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.అయితే వ్యాయామం చేసేందుకు ఒక ఐదారు ఖర్జూరాలు తీసుకుంటే గ‌నుక ఆక్సిజన్ అందించే కెపాసిటీ పెరుగుతుంది.

అదే స‌మ‌యంలో త‌క్ష‌ణ శ‌క్తి కూడా ల‌భిస్తుంది.అలాగే చురుగ్గా వ‌ర్క‌వ‌ట్స్‌ చేయాల‌ని భావించే వారు.

వ్యాయామానికి ముందు తృణధాన్యాలు, బ్రౌన్ బ్రెడ్, అవకాడో, న‌ట్స్‌, పియర్స్ వంటివి తీసుకుంటే.ఫుల్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

తాజా వార్తలు