సంగీత ప్రియులకు లతా మంగేష్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నిజానికి ఆమె పాడిన పాటలే లతా మంగేష్కర్ ను గుర్తు చేస్తాయి.
అలా ఎన్నో పాటలకు తన స్వరాన్ని అందించి తన గానంతో ఎంతో మందిని ఆకట్టుకుంది లతా మంగేష్కర్.మరి అలాంటి గొప్ప సింగర్ ఈరోజు తుది శ్వాస విడవడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక లతా మంగేష్కర్ మొదటిగా తన స్వరాన్ని అందించి ప్రేక్షకులను మెప్పించిన పాట ఏంటో తెలుసుకుందాం.లతా మంగేష్కర్ మొదటిసారిగా పాడిన పాట మహల్ చిత్రం లోనిది.
ఈ చిత్రంలో ‘ఆయేగా ఆయేగా ఆనే ఆనేవాలా’ ఈ పాట అప్పటి ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకుంది.
అప్పట్లో ఆ రోజు తన స్వరాన్ని అందించిన ఈ పాట ఇప్పటికీ మ్యూజిక్ ప్రియుల చెవులలో అలా ఆడుతూనే ఉంది.
ఆ క్రమంలోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ అద్భుత గాయిని దాదాపు 980 సినిమాలకు పైగా తన స్వరాన్ని అందించింది.అలా సినీ ప్రపంచంలో సింగర్ గా వేరే స్థాయిలో ఓ వెలుగు వెలిగి గిన్నీస్ వరల్డ్ రికార్డు దక్కించుకుంది.
తన పాటలతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేసిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తర్వాత అంతటి గాన కోయిల లతా మంగేష్కర్ మాత్రమే.ఇక అలాంటి గొప్ప సింగర్ ఈరోజు అనగా ఫిబ్రవరి 6న తుది శ్వాస విడవడాన్ని సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సైతం ఎవరు జీర్ణించు కోలేక పోతున్నారు.