పరగడుపున ఒక చెంచా నెయ్యి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

సంప్రదాయ భారతీయ వంటల్లో స్వీట్ల తయారీలో ఎక్కువగా నెయ్యి వాడుతుంటారు.నెయ్యిలో ఉండే కమ్మ దనం వలన స్వీట్స్ లో రుచి ఏర్పడుతుంది.

మనిషికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.స్వీట్లు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఉదయం ఒక చెంచా నెయ్యి తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ నెయ్యిని ఎలా తీసుకోవాలి? ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పరగడుపున నెయ్యి తినడం వలన మలబద్ధకం, అధిక రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, గుండె జబ్బులు, పిసిఒఎస్, బలహీనమైన కీళ్ల వ్యాధి ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.

Do You Know What Happens If You Eat A Spoonful Of Ghee, Ghee, Ghee Benefits

అలాగే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పరగడుపున తరచూ ఒక చెంచాడు నెయ్యి తీసుకోవడం వలన వీటన్నిటితో ఉపశమనం లభించడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే నెయ్యిలో ఏ,డి, ఇ, కే విటమిన్ లు ఉంటాయి.రోజు ఉదయం నెయ్యిని తీసుకోవడం వలన బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

Advertisement
Do You Know What Happens If You Eat A Spoonful Of Ghee, Ghee, Ghee Benefits

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావాన్ని కలిగించి ఆకలిని కంట్రోల్ చేస్తాయి.ఇక నెయ్యిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ అసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Do You Know What Happens If You Eat A Spoonful Of Ghee, Ghee, Ghee Benefits

అలాగే మెదడు చురుకుగా పనిచేస్తుందని కూడా చెబుతున్నారు.ఇక కీళ్ల నొప్పు( Joint pains )లతో బాధపడుతున్న వారు కూడా చెంచాడు నెయ్యి తీసుకోవడం వలన నొప్పులు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.అలాగే శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం వలన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

ఇక చర్మం పొడిబార కుండా కాంతివంతంగా చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.అలాగే రోగినిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు