బొప్పాయితో పొర‌పాటున‌ కూడా తిన‌కూడ‌ని ఆహారాలు ఏంటో తెలుసా?

బొప్పాయి..ఈ పండు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

మ‌ధుర‌మైన రుచిని క‌లిగి ఉండే బొప్పాయిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ఫైబ‌ర్, ప్రోటీన్‌తో స‌హా ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే బొప్పాయి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ఆరోగ్యానికే కాకుండా చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందించేందుకు కూడా బొప్పాయి గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.అయితే బొప్పాయి ప్ర‌యోజ‌నాలు.

దాన్ని తీసుకునే విధానంపై కూడా ఆధార‌ప‌డి ఉంటాయి.ముఖ్యంగా బొప్పాయితో కొన్ని కొన్ని ఆహారాల‌ను పొర‌పాటున కూడా తీసుకోరాదు.

Advertisement
Do You Know What Foods Should Not Be Eaten With Papaya , Papaya, Benefits Of Pap

ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.బొప్పాయి, పెరుగు.

.ఈ రెండు ఒకేసారి లేదా వెంట వెంట‌నే అస్స‌లు తీసుకోరాదు.

ఈ రెండిటిని ఒకేసారి తీసుకున్న‌ప్పుడు ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం ప‌డుతుంది.అందుకే బొప్పాయి, పెరుగు తీసుకోవ‌డానికి మ‌ధ్య క‌నీసం రెండు గంట‌లైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

Do You Know What Foods Should Not Be Eaten With Papaya , Papaya, Benefits Of Pap

బొప్పాయి- ఆరెంజ్ పండ్ల‌ను క‌లిపి లేదా ఒకేసారి పొర‌పాటున కూడా తీసుకోరాద‌ని నిపుణులు చెబుతున్నారు.ఈ రెండు పండ్ల‌ను వెంట వెంట‌నే తీసుకుంటే గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు నొప్పి వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి.బొప్పాయి, టమాటా కాంబినేషన్ కూడా అస్స‌లు మంచిది కాదు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

బొప్పాయి పండును తిన్న వెంట‌నే ట‌మాటో వంట‌కాల‌ను తీసుకుంటే మైకం, త‌ల‌నొప్పి, చికాకు, వాంతులు వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

Do You Know What Foods Should Not Be Eaten With Papaya , Papaya, Benefits Of Pap
Advertisement

బొప్పాయి, నిమ్మపండు..ఈ రెండిటీ ఒకేసారి తీసుకోవ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం.

బొప్పాయితో పాటుగా లెమ‌న్ జ్యూస్‌ను తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయి ప‌డిపోయే రిస్క్ ఉంటుంది.దాంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

ఇక బొప్పాయి, కివి.ఈ రెండు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అయిన‌ప్ప‌టికీ వీటిని క‌లిపి లేదా ఒకేసారి తీసుకుంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది.

తాజా వార్తలు