పవన్ కళ్యాణ్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మిస్ అయిన క్లాసిక్ చిత్రం ఏంటో తెలుసా!

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అత్యధిక బ్లాక్ బస్టర్ సినిమాలు, క్రేజీ కాంబినేషన్స్ ని మిస్ అయిన హీరోల లిస్ట్ తీస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముందు వరుస లో ఉంటాడు.

ఆయన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ తీస్తే అభిమానులు ఏడ్చేస్తారు, ఆ రేంజ్ సినిమాలను వదులుకున్నాడు.ఇడియట్ , అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, గజినీ, పోకిరి, అతడు ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మిస్ అయ్యాడు.అలా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ( Gautham Menon )తో కూడా ఒక క్రేజీ సినిమా మిస్ అయ్యాడు.

గౌతమ్ మీనన్ లవ్ స్టోరీస్ మరియు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చెయ్యడం లో సిద్ద హస్తుడు.తెలుగు మరియు తమిళం లో హీరోలకు ఎప్పటికీ మర్చిపోని క్లాసిక్ హిట్ చిత్రాలను అందించాడు.

అలాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ ఒక సినిమా మిస్ అయ్యాడు.

ఆ సినిమా మరేదో కాదు, గీత ఆర్ట్స్ బ్యానర్ లో అప్పట్లో జానీ చిత్రం తర్వాత తెరకెక్కించాలి అనుకున్న సత్యాగ్రహి చిత్రం.ఈ సినిమాని తొలుత గౌతమ్ మీనన్ తెరకెక్కించాలి అనుకున్నాడు.ఆ తర్వాత ఎందుకో ఆయన కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సత్యాగ్రహి( Satyagrahi Movie ) అనే పేరు పెట్టి, స్వీయ దర్శకత్వం లో తెరకెక్కించాలి అనుకున్నాడు.పెద్ద ఎత్తున ఓపెనింగ్ కార్యక్రమం, మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

కానీ ఎందుకో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఆపేయాల్సి వచ్చింది.పవన్ కళ్యాణ్ కి అదే సమయం లో భారీ రెమ్యూనరేషన్స్ ఇచ్చే క్రేజీ మూవీస్ ఆఫర్స్ రావడం తో ఈ సినిమాని మిస్ చేసుకోవాల్సి వచ్చింది.

ఒకవేళ గౌతమ్ మీనన్ ఈ చిత్రం ఒప్పుకొని చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో క్లాసిక్ ఉండేది.

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ ( OG )అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటుగా ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలు కూడా చేస్తున్నాడు.ఈ సినిమాలు ఎన్నికలు రాబోతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి నిలిపివేశాడు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

వచ్చే ఏడాది లో షూటింగ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.ఈ మూడు చిత్రాలపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

తాజా వార్తలు