బుల్లితెరపై ప్రసారమైన డాన్స్ షో ఆట కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి డాన్సర్లు పరిచయమయ్యారు.
ఇక ఆట 4 విన్నర్ గా నిలిచిన గీతిక గురించి అందరికీ తెలిసిందే.ఐదు సంవత్సరాల వయసులోనే ఈమె టైటిల్ విజేతగా నిలవడంతో అందరూ ఈమె పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.
ఇక ఆట తర్వాత గీతిక ఎలాంటి కార్యక్రమాలలోనూ సందడి చేయలేదు.అయితే ఐదు సంవత్సరాల వయసులో అందరిని సందడి చేసిన గీతిక ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే…
గీతిక ఆట 4 టైటిల్ గెల్చుకున్న తర్వాత పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.
అయితే తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లడంతో ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ఇవ్వాలని భావించి చదువుపై దృష్టి పెట్టారు.అయితే ఆవిరామం చాలా కాలం పాటు వచ్చిందని ఈ సందర్భంగా గీతిక వెల్లడించారు.
ఇకపోతే ఈమె బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు.

చిన్నప్పుడు డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న తనకు కాస్త విరామం ఇవ్వడంతో చదువుపై దృష్టి పెట్టానని ఎడ్యుకేషన్ పరంగా ఎంతో కంఫర్ట్ ఉండడంతో తను పై చదువుల కోసం వెళ్లానని గీతిక వెల్లడించారు.ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ గురించి మాట్లాడుతూ తాను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతానని అయితే ఇందులో కంటెస్టెంట్ నైనిక పెర్ఫార్మన్స్ తనకు చాలా బాగా నచ్చుతుందని ఈమె వెల్లడించారు.తనకు ఇష్టమైన హీరో గురించి మాట్లాడుతూ తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం అని ఈ సందర్భంగా గీతిక వెల్లడించారు.