నైరుతి దిశలో తరుచు కాకి అరిస్తే దేనికి సంకేతమో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కాకిని కొన్ని కార్యక్రమాలకు పవిత్రంగా భావిస్తారు.ఏదైనా పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కాకిని పవిత్రంగా భావిస్తారు.

కానీ కొన్ని సమయాలలో అశుభంగా భావిస్తారు.ఈ క్రమంలోనే కాకి మన ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తారు.

ఎందుకంటే కాకి శనీశ్వరుడి వాహనం కనుక మనకు శని ప్రభావం ఉంటుందని భావిస్తూ కొందరు శాంతి పూజలు చేయిస్తారు.అదేవిధంగా తరచూ కాకి వచ్చి మనల్ని తాకిన, అశుభంగా భావించి వెంటనే స్నానం చేయడం చూస్తుంటాము.

అయితే కొన్ని సార్లు మన ఇంటి మేడపై లేదా ఇంటి చుట్టు కాకులు తరుచు అరుస్తూ ఉంటాయి.ఇలా అరవడం వల్ల మన ఇంటికి ఏదైనా అశుభం జరుగుతుందని కొందరు భావిస్తుంటారు.

Advertisement
Do You Know The Sign Of A Crow Often Burning In The Southwest Crow, Signel, Sout

మరి కొందరు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారని చెబుతారు.అలాగే మరి కొందరు మన ఇంటికి పితృదేవతలు వచ్చారని భావించి కాకులకు ఆహారం పెడుతుంటారు.

అయితే కాకుల అరుపులలో కూడా ఎన్నో రకాల సంకేతాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా కాకి మన ఇంటి నైరుతి దిశ వైపు అరవడం వల్ల ఎంతో శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Do You Know The Sign Of A Crow Often Burning In The Southwest Crow, Signel, Sout

నైరుతి దిశ అంటే కుబేరుడికి అనువైన స్థానం.కనుక నైరుతి దిశ సిరిసంపదలకు మంచిదని భావిస్తారు.ఇక కాకి మన ఇంటి మేడపై లేదా మన ఇంటి కాంపౌండ్ లో నైరుతి దిశలో ఉండి తరచు అరవడం వల్ల మన ఇంటికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందని అర్థం.

ఇలా కాకి నైరుతిదిశలో అరిస్తే ఆ ఇంటికి ధన ప్రవాహం కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు