బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ( Priyanka Jain ) ఒకరు.పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఈ సీజన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
బిగ్ బాస్ హౌస్లో అందరితో ఈమె చాలా కలివిడిగా ఉంటూ అవసరమైనప్పుడు తన వాయిస్ వినిపిస్తూ స్ట్రాంగ్ కంటెంట్ గా కొనసాగుతూ వచ్చారు.ఇక హౌస్లో అందరికీ ప్రియాంక జైన్ ఎంతో ప్రేమతో వంట చేసి కూడా పెడుతుంది.
ఇలా హౌస్ లో కొనసాగుతూ స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నటువంటి ప్రియాంక జైన్ కోసం గత ఆదివారం బిగ్ బాస్ వేదికపైకి తన తల్లితో పాటు నటి ప్రగతి( Pragathi ) కూడా వచ్చారు.
ఇలా వేదిక పైకి తన తల్లి అలాగే నటి ప్రగతి రావడంతో ఒక్కసారిగా ప్రియాంక జైన్ ఎమోషనల్ అయ్యారు.దీంతో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు ప్రియాంక జైన్ కోసం ప్రగతి వేదిక పైకి రావడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రగతికి ప్రియాంక మధ్య ఒక రిలేషన్ ఉందని తెలుస్తుంది వేదిక పైకి ప్రియాంక కోసం వచ్చినటువంటి వారిలో ఒకరు రియల్ మదర్ కాగ ప్రగతి రీల్ మదర్( Reel Mother ) కావడం విశేషం.ప్రియాంక నటించిన మొదటి సినిమాలో ఆమెకు తల్లి పాత్రలో ప్రగతి నటించారు.
అప్పటి నుంచి వీరిద్దరి బాండింగ్ అలాగే కొనసాగుతూ వస్తోంది.ఇక ఈ విషయం తెలిసినటువంటి బిగ్ బాస్ నిర్వాహకులు ప్రగతిని ప్రియాంక కోసం వేదిక పైకి తీసుకోవచ్చారు.
ప్రియాంక ప్రగతిని బిగ్ బాస్ వేదికపై చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక ప్రగతి మాట్లాడుతూ.నువ్వు చాలా అద్భుతంగా ఆడుతున్నావు ఇది చెప్పి వెళ్దామనే నేను ఇక్కడికి వచ్చాను.చాలా ధైర్యంగా హద్దులు దాటకుండా ఆడుతున్నావు అంటూ ప్రగతి చెప్పడంతో నాకు ఇది చాలు, ఇంతకన్నా నేను ఏమీ అడగను అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యారు.
ఇలా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బాండింగ్ చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇక ప్రగతిని బిగ్ బాస్ వేదికపై చూడటంతో ఆమె అభిమానుల ఓట్లు కూడా ప్రియాంకకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాలి.