ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది.
రీసెంట్ గా ఆయన చేసిన సలార్( Salaar ) సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి పూరి జగన్నాధ్( Puri Jagannadh ) అంటే చాలా ఇష్టమాట.
ఇక వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి.అందులో బుజ్జిగాడు సినిమా( Bujjigadu Movie ) సమయంలో పూరి జగన్నాథ్ ఆటిట్యూడ్ కి ఫిదా అయిపోయిన ప్రభాస్ చాలా సంవత్సరాల పాటు పూరి తో ఫ్రెండ్షిప్ చేస్తూ వస్తున్నడు.
ఇక బుజ్జిగాడు సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఆ తర్వాత వెంటనే మళ్ళీ పూరి జగన్నాథ్ తో ఏక్ నిరంజన్( Ek Niranjan ) సినిమా చేశాడు.
ఇది కూడా యావరేజ్ గా ఆడింది.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సినిమా కూడా రాకపోయినప్పటికీ, బుజ్జిగాడు సినిమాతో ప్రభాస్ కి మంచి ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాడు.ముఖ్యంగా వీళ్ళు షూటింగ్ టైంలో డార్లింగ్, డార్లింగ్ అనుకుంటూ పిలుచుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేవారు.
ఇప్పటికీ కూడా అవకాశం దొరికితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించడానికి సిద్దంగా ఉన్నాడు.కానీ ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double iSmart Movie ) చేస్తున్నాడు.
కాబట్టి ప్రభాస్ తో మరొక సినిమా చేస్తాడేమో చూడాలి.
అయితే పూరి జగన్నాథ్ ఒక హీరోకి ఇచ్చే క్యారెక్టరైజేశన్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టమట.అందువల్లే మొదట తనతో సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడని చాలాసార్లు చెప్పాడు.కానీ ఒకసారి అతనితో సినిమా చేసిన తర్వాత అతనితో మనం ప్రేమలో పడిపోతాం అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి…
.