ఆలయాలలో పుష్కరిణి నిర్మించడానికి కారణం ఏంటో తెలుసా..?

మన భారతదేశం( India )లోని దాదాపు ప్రతి ఆలయంలో, పుణ్యక్షేత్రంలో ఒక పవిత్రమైన పుష్కరిణి ఉండడం దాదాపు అందరూ గమనించే ఉంటారు.

ఈ జలాశయాన్ని లేదా చెరువును తీర్థం లేదా పుష్కరిణి అని అంటారు.

అయితే ఈ రోజుల్లో కొత్తగా కట్టిన చాలా దేవాలయాలలో ఈ రకమైన పుష్కరిణిలు కనిపించడం కష్టంగా మారింది.మన పురాతన ఆలయాలను పరిశీలిస్తే పుష్కరిణి తప్పక కనిపిస్తుంది.

ఈ పుష్కరిణిలు వెనుక ఒక కథ లేదా చరిత్ర ఉంటుంది.పూర్వం రోజులలో చాలా ప్రసిద్ధ దేవాలయాలు నది ఒడ్డున నిర్మించారు.

ఇంతకీ నీటి వనరులకు దేవాలయాల( Temple )కు సంబంధం ఏమిటి.భారతదేశంలో పురాతన దేవాలయాలలో పుష్కరిణి నీళ్లు ఎందుకు ఉన్నాయి.అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే పూర్వం రోజులలో దాదాపు అందరూ దేవాలయానికి వెళ్లేవారు.సందర్శకులు కూడా దేవాలయాలకు సంబంధించిన సత్రాలలోనే బస చేసేవారు.

నిత్య పూజలు చేసే పూజారులు దేవాలయాల దగ్గర నివసించేవారు.ఆ రోజుల్లో దేవాలయాల పరిశుభ్రత, దేవతలను శుభ్రపరచడం, త్రాగడానికి వంట అవసరాలకు, దేవతలకు, భక్తులకు( Devotees ) పవిత్ర స్నానాలకు పుష్కరిణి నీళ్లు ప్రధాన నీటి వనరుగా ఉపయోగించేవారు.

చాలామంది దేవాలయాలలో అన్న ప్రసాదం తిని రోజులు గడిపేవారు.దేవాలయ ప్రసాన్ని స్వీకరించడానికి చాలామంది భక్తులు ఎదురు చూసేవారు.అందువల్లే దేవాలయాలలో వాటి చుట్టుపక్కల పవిత్ర పుష్కరిణిలు, తీర్థాలు నిర్మించారు.

అప్పట్లో అవే సమాజానికి ప్రధాన నీటి వనరులుగా ఉండేవి.ఇంకా చెప్పాలంటే ఆలయాలు మంత్రోచ్ఛారణలు గంటలు మోగించడం ద్వారా సృష్టిలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్28, సోమవారం 2024

సాధారణంగా గుడి తప్ప చాలా చోట్ల కూర్చోని కబుర్లు చెప్పుతూ ఉంటారు.కానీ ప్రజలు ఎప్పుడూ గుడిలో కబుర్లు చెప్పకూడదు.

Advertisement

దేవాలయంలోని నీటి వనరులు ఆలయంలోని వాతావరణాన్ని మరింత శుద్ధి చేస్తాయి.నీరు జీవనానికి మూలం, శక్తికి చిహ్నం అని పండితులు చెబుతున్నారు.

నీరు సానుకూల శక్తిని గ్రహిస్తుందని చెబుతున్నారు.

తాజా వార్తలు