మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27వ తేదీ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఇలా రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు (Birthday)సందర్భంగా సౌత్ నుంచి మొదలుకొని నార్త్ సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే మరికొందరు సెలబ్రిటీలు ఏకంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లి రాంచరణ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఇలా సెలబ్రిటీలు వచ్చిన సమయంలో రామ్ చరణ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ లో మెగాహీరో కనిపించాడు.
ఇలా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ధరించిన ఈ షర్టుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ధరించిన ఈ షర్ట్(Shirt) ఖరీదు ఎంత అనే తెలుసుకొనే పనిలో అభిమానులు ఉన్నారు.ఇక ఈ షర్ట్ గురించి సెర్చ్ చేయగా ఊహించని షాక్ తగిలింది.
ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో ఈ షర్ట్ కనిపించింది.జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉంది.
ఇక ఈ షర్ట్ ఏకంగా 983 డాలర్లు ఖరీదు ఉంది.భారత కరెన్సీ ప్రకారం ఈ షర్ట్ విలువ రూ.80,961 అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు నేటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఇలా రామ్ చరణ్ ధరించిన ఈ ఒక్క షర్టుతో ఒక నిరుపేద కుటుంబం ఏడాది మొత్తం ఎంతో సంతోషంగా గడపవచ్చని పలువురు భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈ షర్ట్ ధర తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ పార్టీలో ఉపాసన(Upasana) కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇక ఈ వేడుకలలో భాగంగా ఉపాసన బేబీ బంప్(Baby Bump) ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy