9 భాషల్లో నటించి.. తెలుగులో వంద సినిమాలు పూర్తి చేసిన హీరో ఎవరో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఇప్పటికీ వందకు పైగా సినిమాలలో నటించి మంచి రికార్డు సంపాదించుకున్నారు.

కొందరు ఒకే భాషలో 100కు పైగా సినిమాలలో నటించగా మరికొందరు రెండు, మూడు భాషలలో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక ఓ హీరో కూడా తొమ్మిది భాషల్లో నటించి అందులో తెలుగులో 100 సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇంతకు ఆ హీరో ఎవరో కాదు సుమన్.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు సుమన్. ఈయన నటన గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.

ఎన్నో పాత్రల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.హీరోగా, విలన్ గా, సహాయ నటుడుగా, దైవ పాత్రలుగా నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు.

Advertisement

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, ఇంగ్లీష్ భాషలతో పాటు మరెన్నో భాషలలో కూడా నటించాడు సుమన్.ఈయన తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి 1983 లో అడుగుపెట్టాడు.

ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లి స్టార్ హీరోగా ఎదిగాడు.తెలుగుతోపాటు ఎన్నో భాషలలో కలిపి 500 కి పైగా సినిమాలలో నటించి.

ప్రేక్షకులలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలలో దేవుని పాత్రలతో బాగా మెప్పించాడు.

ఇక రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ గా బాగా అదరగొట్టాడు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు సుమన్.ఒక నటుడుగానే కాకుండా రాజకీయాలలో కూడా బాధ్యతలు చేపట్టాడు.1999లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాడు.ఆ తర్వాత తెలుగుదేశం లో చేరాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇక ఈయన తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.ఇక ఈయన కుటుంబ విషయానికి వస్తే శిరీష తల్వార్ ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక కూతురు కూడా ఉంది.

Advertisement

ఇక తాజాగా ఈయన బుల్లితెరలో ఈటీవీ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే రియాలిటీ షో కు గెస్ట్ గా వచ్చాడు.దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

అందులో సుమన్ తన వ్యక్తిగత విషయాలను, తన సినిమా విషయాలను బాగా పంచుకున్నాడు.ఇక తాను పుట్టింది.చదివిందంతా చెన్నైలో అని తెలిపాడు.

తన పేరెంట్స్ ది బెంగళూరు అని.ఉద్యోగం కోసం చెన్నై కి వచ్చి సెటిల్ అయ్యారని తెలిపాడు.తనను యాక్టర్ గా గుర్తించింది తమిళనాడు ప్రజలు అని అన్నాడు.

తన మిత్రుడు భానుచందర్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టాను అని తెలిపాడు.ఇక తాను మొత్తం తొమ్మిది భాషలలో నటించానని తెలిపాడు.

తెలుగులో వంద సినిమాలు హీరోగా పూర్తయ్యాయని అన్నాడు.ఇక ఈయన గత ఏడాది తెలంగాణ దేవుడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు