నటి లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసింది ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) తో గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ చివరికి పెద్దల సమక్షంలో పెళ్లికి సిద్ధమయ్యారు.ఇప్పటికే వీరి నిశ్చితార్థపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ( Pre wedding celebrations )కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలలో లావణ్య చాలా స్టైలిష్ గా ఎల్లో కలర్ చుడీదార్ వేసుకుని అందంగా కనిపించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అందరి దృష్టి లావణ్య పైనే పడింది.ఈమె చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా చేతిలో చిట్టి హ్యాండ్ బ్యాగ్ ( Hand Bag ) పట్టుకొని కనిపించడంతో అందరి దృష్టి ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ పై పడింది దీంతో లావణ్య చేతిలో ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత అనే విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.లావణ్య చేతిలో ఉన్నటువంటి ఈ బ్యాగ్ చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ దీని ఖరీదు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.
ఇలా ఈ ఫోటోలలో లావణ్య చేతిలో ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాల 1,57,000 రూపాయలు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్ కోసం లక్షల్లో ఖర్చు చేయాలా ఏది ఏమైనా లావణ్య మెగా రేంజ్ కి ఏమాత్రం తగ్గడం లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని వీరి వివాహం ఇటలీలో జరగబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అనే విషయం గురించి ఎక్కడ క్లారిటీగా తెలియజేయలేదు అయితే ఈ నెల లేదా వచ్చే నెల మొదటి వారంలో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది.