చైతన్య సమంతల సంపాదన ప్రస్తుతం అన్ని కోట్లా..?

చైతన్య సమంత సినిమాసినిమాకు క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.సినిమా ఆఫర్లతో పాటే చైతన్య, సమంతలకు రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది.

సమంత ప్రస్తుతం నటిస్తున్న శాకుంతలం సినిమాకు 2.5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుండగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్టైతే మాత్రం సమంత పారితోషికం మరింత పెంచే అవకాశం ఉంది.మరోవైపు చైతన్య ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం చైతన్య సమంత ఆస్తుల విలువ 125 కోట్ల రూపాయలని తెలుస్తోంది.ఈ ఆస్తులలో సమంత వాటానే ఎక్కువ అని సమాచారం.చై సామ్ ల సంపాదన సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుండటం గమనార్హం.

గతేడాదికి ఈ ఏడాదికి చైసామ్ ల సంపాదన 15 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెరిగిందని తెలుస్తోంది.సుదీర్ఘ ప్రేమాయణం తరవాత చై సామ్ పెళ్లి చేసుకోగా పెళ్లి తర్వాత గొడవలు లేకుండా చైతన్య, సమంత సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావాల్సి ఉంది.

Do You Know Naga Chaitanya And Samantha Akkineni Combined Net Worth , 125 Crores
Advertisement
Do You Know Naga Chaitanya And Samantha Akkineni Combined Net Worth , 125 Crores

సమంత రెండు స్టార్టప్ లను స్టార్ట్ చేయగా అందులో ఒకటి ఏకామ్ అనే ప్రీస్కూల్ అయితే మరొకటి సాకి పేరుతో ఉన్న ఫ్యాషన్ లేబుల్ కావడం గమనార్హం.సమంతకు సొంతంగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఉంది.మరోవైపు నాగచైతన్యకు ఖరీదైన బంగ్లాలతో పాటు కార్లు కూడా ఉన్నాయి.

చైతన్య, సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటంతో పాటు ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు.నాగచైతన్య వరుస సినిమాల్లో నటిస్తూ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే కరోనా నాగచైతన్య ప్లాన్ కు అడ్డంకులు వేస్తుండగా చైతన్య నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజవుతాయో లేదో చూడాల్సి ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు