డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం పాటిస్తే మంచిదో కాదో తెలుసా..

మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు అప్పుడప్పుడు పండుగల సందర్భంగా ఉపవాసం ఉంటారు.

ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు అయితే ఉపవాసం ఎలా ఉండాలో అని ఆలోచిస్తూ ఉంటారు.

ఇలాంటి వారికి ఇది శుభవార్త అని చెప్పాలి.ఎందుకంటే చక్కర వ్యాధి బాధితులైన సరే ఫాస్టింగ్ ఉండవచ్చని ఇది డయాబెటిస్ నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.

ప్రతి సందర్భంలో కాకపోయినా అప్పుడప్పుడైనా ఉపవాసం ఉండడం అనేది చాలా కుటుంబాలలో ఆనవాయితీగా వస్తుంది.వారానికి ఒక్కసారైనా లేదా పండుగలప్పుడు అయినా ప్రత్యేక పూజలు, వ్రతాల సమయాలలో ఉపవాసం ఉండేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇంకొంత మంది బరువు పెరుగుతామేమో అనే భయంతో ,మరికొందరు బరువు తగ్గాలని ఆశతో ఉపవాసం పటిస్తూ ఉంటారు.కారణమేదైనా ఉపవాసం ఉండడం ఎంతో మేలు అని ఇది చక్కర వ్యాధిని తగ్గిస్తుందని, అంతేకాకుండా అధిక బరువు సమస్యను కూడా నివారిస్తుందని కొన్ని అధ్యయన పరిశోధనలలో తేలింది.

Advertisement

ఆరోగ్యం, ఆనందం, భక్తి కూడా ఇమిడి ఉండడంతో చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నారు.కానీ డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉంటే ఏమైనా ఆరోగ్యానికి ప్రమాదం ఉందా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.

దీనిపై ఒక అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలకు చక్కర వ్యాధిగ్రస్తులు కూడా ఉపవాసం ఉండవచ్చని స్పష్టం చేశారు.డయాబెటిస్ నివారించడంలో ఉపవాసం ఏవిధంగా తోడ్పడుతుందని అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 38 నుంచి 72 సంవత్సరాల వయసు గల వారిపై ఈ ప్రయోగం చేశారు.

ఈ అధ్యయనం ప్రకారం మూడు నెలల పాటు అప్పుడప్పుడు ఉపవాసం ఉన్నవారికి చక్కెర వ్యాధి తగ్గుతుందని వారు ఈ పరిశోధనలో గుర్తించారు.ఇలా ఉపవాసం ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం మల్టీ విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.కేవలం పోషకాహారమే కాకుండా తగినంత నీరు కూడా తాగాలి.

అంతేకాకుండా టైప్ టు డయాబెటిస్ తగ్గించుకోవాలంటే శరీరక శ్రమ ఉండాలి.నిద్రలేమి అసలు ఉండకూడదు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
సొంతింటి కలను నిజం చేసుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. కల నెరవేరిందిగా!

పోషకాహార లోపం కూడా ఉండకూడదు.ఇంకా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను అలవాటు చేసుకోవడం కూడా ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు