శివాజీ గణేషన్ ( Sivaji ganesan ) కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభు అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈయన ఎక్కువగా కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో చేశారు.
అయితే అలాంటి ప్రభు ( Prabhu ) ఒకప్పుడు స్టార్ హీరో అయినప్పటికీ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.ఇక కేవలం కోలీవుడ్ లోనే కాకుండా ఈయన తెలుగులో కూడా చాలా సినిమాల్లో హీరోలకు తండ్రి, మామ పాత్రల్లో చేశారు.
నటుడు ప్రభు ఈ మధ్యనే తన కూతురు ఐశ్వర్య కి రెండో పెళ్లి చేసిన విషయం తెలిసిందే.ఇక ఐశ్వర్య మొదట తన మేనత్త కొడుకు అయినా కునాల్ ని పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడింది.
కునాల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.

అయితే పెళ్ళైన కొద్దిరోజులు బాగానే ఉన్న ఈ జంట మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.దాంతో విడాకుల తర్వాత ఐశ్వర్య ఇండియాకి తిరిగి వచ్చేసి కేక్ తయారీ చేసే బిజినెస్ చేస్తోంది.అయితే గత కొద్దిరోజుల నుండి తమిళంలో యంగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అధిక్ రవిచంద్రన్ ( AdhMarraik ravichandran ) తో ప్రేమలో ఉన్న ఐశ్వర్య వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకి తెలిపి ఇంట్లో వారిని ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

ఇక ఐశ్వర్య ( Aishwarya ) ఏజ్ 34 అయితే అధిక్ రవిచంద్రన్ ఏజ్ 32 మాత్రమే.వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ తమ ప్రేమ ఆ గ్యాప్ ని తొలగించిందని చెప్పుకోవచ్చు.అలా ప్రభు తన కూతురికి రెండో పెళ్లి చేశారు.ఇక ఈ పెళ్లి లో కూతురికి కట్నం గా ప్రభు ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా అంటూ కోలీవుడ్ మీడియాలో తాజాగా ఒక వార్త తెగ ప్రచారం జరుగుతుంది.
మరి ఇంతకీ తన కూతురు అత్తారింటికి ఎన్ని కోట్లు తీసుకువెళ్లిందంటే.ప్రభు తన కూతురికి తను సంపాదించిన ఆస్తిలో సగభాగం ఇస్తానని చెప్పారట.అలాగే అత్తారింటికి వెళ్లే సమయంలో కోటి రూపాయల డబ్బు, బంగారం అలాగే తన కూతురు సంపాదించిన ఆస్తిపాస్తులు మొత్తం తనకే ఇచ్చేసారట.ఇవే కాకుండా తన అల్లుడికి కట్నంగా చెన్నైలో ఉండే కాస్ట్లీ బంగ్లా ని కూడా రాసి కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తుంది.