భారతదేశంలో కొలువైన 5 మిస్టరీ ఆలయాలు ఇవే?

అత్యంత పురాతన సంస్కృతికి నిలయం మన భారతదేశం. ఇక్కడ అంతు చిక్కని రహస్యాన్నో వున్నాయి.

అందులోనూ ముఖ్యంగా మన పూర్వీకుల కట్టడాలకు చాలా ప్రత్యేకతలు వున్నాయి.ఇక్కడ కొన్ని ఆలయాలు ఎప్పుడు, ఎలా కట్టారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయాయి.

అయితే, అలాంటి ఐదు మోస్ట్ మిస్టీరియస్ ఆలయాల( Mysterious Temples ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇక్కడ మొదటగా "కోణార్క్ సన్ టెంపుల్"( Konark Sun Temple ) గురించి మాట్లాడుకోవాలి.

ఈ ఆలయాన్ని క్రీ.శ.1236 నుంచి క్రీ.శ.1264 మధ్య గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవా అనే రాజు కట్టించినట్లు భోగట్టా.ఈ ఆలయాన్ని 7 గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథం ఆకారంలో నిర్మించడం విశేషం.

Advertisement

ఈ ఆలయంలో కొన్ని టన్నుల బరువుతో పెద్ద అయస్కాంతం ఉండేదని, ఆ అయస్కాంతంతో గుడిలోని విగ్రహాం గాలిలో తేలియాడుతూ ఉండేదని పురణాలు చెబుతున్నాయి.అయితే, ఆ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారో, ఎందుకు కూల్చారో అన్న విషయం ఇంత వరకు తెలియదు.

2వ ఆలయం "బృహదీశ్వరాలయం."( Brihadeeswara Temple ) తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఈ గుడిని వేయి సంత్సరాల క్రితం నిర్మించడం జరిగింది.క్రీ.శ.1010లో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళులు ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి.ఈ గుడి గాలి గోపురంపై ఉన్న గుండ్రని కట్టడం ఒక్కటే మొత్తం 80 టన్నుల బరువు ఉంటుంది.

టెక్నాలజీ లేని ఆ కాలంలో ఆ గాలి గోపురం పైన అంత బరువైన రాయిని ఎలా పెట్టారో ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీయే.

ఇక 3వ ఆలయం పేరు "వీరభద్ర ఆలయం."( Veerabhadra Swamy Temple ) ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా లోని లేపాక్షిలో ఉంది.క్రీ.

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

శ 1530 లలో విజయనగర రాజులు ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు.ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది.

Advertisement

అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది.అలా అది ఎందుకు తెలియాడుతుందో ఎవరికీ తెలియదు.

కాగా ఈ వింతను చూసేందుకు చాలా ప్రదేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు ఈ ఆలయానికి వస్తారు.

ఇక 4వ ఆలయం పేరు "అనంత పద్మనాభ స్వామి ఆలయం."( Anantha PadmaNabhaswamy Temple ) కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయాన్ని ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో ఎవరికీ తెలియదు.ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే బంగారం మణి, మాణిక్యాలు దొరకాయనే విషయం అందరికీ తెలిసినదే.

ఆ సంపద మొత్తం గుడి నేలమాలిగలలో ఉన్న కేవలం ఐదు గదులలోంచి తీసినదే.ఇంకా అక్కడ తెరవని 3 గదులున్నాయి.వాటిలో ఒక గది ఇనుప తలుపుపై పెద్ద పెద్ద సర్పాల బొమ్మలతో ఉంది.

వాటినే నాగబంధనం అని మన పురాణాలు చెబుతున్నాయి.ఇక ఆ గదిలో ఏముంది ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారనే విషయాలు ఇప్పటికీ ఒక రహస్యంగానే వుంది.

ఇక చివరగా ఇక్కడ "కైలాస ఆలయం"( Kailasa Temple ) గురించి మాట్లాడుకోవాలి.మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.చరిత్రకారుల లెక్కల ప్రకారం క్రీస్తు శకం ఆరో శతాబ్ధంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్ర కూట వంశానికి చెందిన రాజులు కట్టించినట్లు భోగట్టా.

ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో చెక్కారు.ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం కావడం దీని ప్రత్యేకత.

" autoplay>

తాజా వార్తలు