ఈ యాప్స్ మీదగ్గరున్నాయా? 'గూగుల్ ప్లే స్టోర్' లక్షల్లో యాప్‌లను రిమూవ్ చేసేస్తోంది!

గూగుల్ ప్లే స్టోర్.అంటే ఏమిటో తెలియని యువత ఉండనే వుండరు.

అవసరమైన యాప్స్ కోసం యూజర్స్ గూగుల్ ప్లే స్టోర్ ని సందర్శిస్తూ వుంటారు.

అందుకే వినియోగదారుల ప్రైవసీ దృష్ట్యా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్లే స్టోర్‌ సుమారు 9లక్షల పైనే యాప్‌లను తొలగించేందుకు రంగం సిద్ధమైంది.గూగుల్‌, ఆపిల్‌ తమ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని తాజాగా తగిన చర్యలు చేపడుతున్నాయి.

ఈ క్రమంలో అనవసరమైన పాత యాప్‌లు ఆండ్రాయిడ్‌, IOSలలో మార్పులు, కొత్త APIలు భద్రతను మెరుగుపరచడానికి కొత్త పద్ధతులను వినియోగించుకోవడం లేదు.ఈ కారణంగా పాత యాప్‌లు భద్రత ఉండదు గనుక వాటిని నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

అలాగే గూగుల్‌ ఇటీవల థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్‌ యాప్‌లను కూడా నిషేధించి షాక్ ఇచ్చింది.గత నెలలోనే అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించడం తెలిసినదే.

తాజాగా గత 2 సంవత్సరాలుగా యాప్స్‌ డెవలపర్లు ఎలాంటి అప్‌డేట్స్‌ చేయకపోవడంతోనే గూగుల్ ప్లే స్లోర్ నుంచి 9లక్షల యాప్ లను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది.ఇకనుండి గూగుల్ ప్లే స్టోర్ లలో తొలగించిన యాప్ లను మరలా డౌన్ లోడ్ చేసుకొవడం కుదరదు.

గూగుల్ యాప్ స్టోర్‌ల నుండి యాప్ లను తొలగించడానికి ప్రధాన కారణం ఏమంటే వినియోగదారు డేటా రక్షణ దృశ్య మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఆయా యాప్‌ల డవలపర్స్ చేయకపోవడం వంటివి రీజన్స్ గా కనబడుతున్నాయి.ఈ కారణాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని గూగుల్ సంస్థ తమ ప్లే స్టోర్ నుంచి లక్షల్లో యాప్ లను తొలగిస్తోంది.

ఇదిలా ఉంటే రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ Android 13, Google శోధన ఫీచర్‌లో మార్పులు, యుట్యూబ్‌కి ఫీచర్‌లను జోడించడం వంటి అనేక కొత్త విషయాలలో మార్పుపు చేర్పులు తీసుకురాబోతుంది.వీటితో పాటు కంపెనీ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా ప్రకటించింది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇది ఇంటర్నెట్ బ్రౌజర్, షాపింగ్ అనుభవాన్ని సురక్షితంగా చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు