ఉదయం నిద్ర లేవగానే ఈ పని చేస్తున్నారా... అయితే సమస్యలు మీవెంటే..?

ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే చాలామంది ఎవరికి తోచిన రీతిలో వారు ఇష్టదైవాలను మొదటగా చూడడం చేస్తుంటారు.

ఈ విధంగా నిద్రలేవగానే ఒక్కొక్కరు ఒక్కో అలవాటును పాటిస్తారు.

కొందరు భూదేవికి నమస్కరించగా, మరి కొందరు వివిధ రకాల దేవుడి ఫోటోలను చూస్తుంటారు.మరి కొందరు ఇంట్లో ఉన్నటువంటి చేప బొమ్మలు లేదా ఏనుగు బొమ్మలను చూస్తూ నిద్రలేవడం చేస్తుంటారు.

ఇక చాలామంది వారి మెడలో ఉన్న దేవుడి లాకెట్,చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని చూస్తూ నిద్రలేస్తారు.మరికొందరు అరచేతులను చూసుకొని నిద్రలేవడం అలవాటుగా ఉంటుంది.

ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు.కానీ ఉదయం లేవగానే మొదటిసారిగా అద్దంలో మన మొహం చూసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకోవటం వల్ల సమస్యలు వెంటాడుతాయని అద్దంతో పాటు చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడటం ఏ మాత్రం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకుంటే మనం తలపెట్టే కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.

అదే విధంగా ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తున్న ఆ కార్యానికి విరుద్ధంగా జరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.

ఉదయం లేవగానే అద్దం, ఆవాలు, పెరుగు వంటి వస్తువుల మొహం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఉదయం నిద్రలేవగానే మన అర చేతులను బాగా రుద్ది అరచేతులను చూసుకోవడం ఎంతో ఉత్తమమని, ఈ విధంగా అరచేతులను రుద్ది కళ్ళు తెరవడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహించి రోజంతా ఎంతో చురుగ్గా సంతోషంగా గడుపుతారు.కనుక ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకునే అలవాటు ఉన్నవారు ఇకపై అలవాటును మానుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు