అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే ఏం అవుతుందో తెలుసా?

జీడిప‌ప్పు.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగించే జీడిప‌ప్పును.

చాలా మంది ఇష్టంగా తింటుంటారు.జీడిప‌ప్పును ఇటు స్వీట్స్‌లో.

అటు హాట్స్‌లో కూడా ఉప‌యోగిస్తుంటారు.ఎంతో టేస్టీగా ఉండే జీడిప‌ప్పులో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగుతున్నాయి.

అయితే అధిక బ‌రువు ఉన్న‌వారు జీడిప‌ప్పు తింటే మ‌రింత బ‌రువు పెరుగుతార‌ని న‌మ్ముతారు.కానీ, ఇది అపోహ మాత్ర‌మే.

Advertisement

ప్ర‌తిరోజు మోతాదు మించకుండా గుప్పెడు జీడిప‌ప్పును.నీటిలో నాన‌బెట్టి తీసుకుంటే అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఎందుకంటే.జీడిప‌ప్పులో ఉండే పోష‌కాలు శరీరానికి హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు క్ర‌మంగా త‌గ్గుతుంది.

బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.జీడిప‌ప్పు వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు ప్ర‌తిరోజు జీడిప‌ప్పు తీసుకుంటే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
News Round up: న్యూస్ రౌండప్ టాప్ 20

ఇందులో ఉండే ఐర‌న్ ర‌క్తాన్ని వృద్ధి చేస్తుంది.అలాగే జీడిప‌ప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఒలిక్‌ ఆసిడ్‌ గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి.

Advertisement

మెగ్నీషియం పుష్కలంగా ఉన్న జీడిప‌ప్పు తిన‌డం వ‌ల్ల ఎముకలు, కండరాలు మ‌రియు దంతాలు దృఢంగా మార‌తాయి.అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారికి కూడా జీడిప‌ప్పు మంచి ఔష‌ధం.

అందుకే ప్ర‌తిరోజు గుప్పెడు జీడిప‌ప్పు తీసుకోమ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక క్యాన్సర్  ప్రమాదాన్ని త‌గ్గించ‌డంలోనూ, కిడ్నీలో రాళ్లు క‌రిగించ‌డంలోనూ, చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చ‌డంలోనూ జీడిప‌ప్పు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

‌.

తాజా వార్తలు